ఇండియాలో కరోనా ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇక కరోనా పీడ విరగడ అయింది అనుకున్న తరుణంలో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. రోజుకు దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రజలంతా తప్పనిసరిగా కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఇక తాజాగా కేంద్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశంలో కరోనా కేసులు తగ్గాయి. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 9,520 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 41 మంది కొవిడ్‌కు బలయ్యారు.
ఒక్కరోజులో 12,875 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.62 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.20 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.