Foot Pain Remedies | మనలో చాలామందిని అరికాళ్ళ నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ఉదయం నిద్ర లేవగానే అరికాళ్ళలో నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. కాలు కింద పెడితే జివ్వుమని లాగేస్తున్నట్టు అనిపిస్తుంది. కొద్దిసేపు నడిచిన తర్వాత సెట్ అవుతుంది. అరికాళ్ళ నొప్పులు పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా ఉంటాయి. వయసు పైబడటం, మడమ భాగంలో కణజాలం పెరగటం, ఊబకాయం, మధుమేహం చెప్పులు లేకుండా నడవటం వంటివి అరికాళ్ళలో నొప్పులకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. బాధించే అరికాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అని ఇప్పుడు తెలుసుకుందాం.
Foot Pain Remedies
శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. బాడీ వెయిట్ కంట్రోల్ లో ఉంటే పాదం మీద ఎక్కువ భారం పడదు. దీంతో పాదం మీద, అరికాలిలో నొప్పి వచ్చే అవకాశం తగ్గుతుంది.
పాదాల మధ్య వంపు ఎక్కువగా ఉన్నప్పుడు వాటికి సపోర్ట్ గా నిలిచే మెత్తటి షూస్ ధరించాలి.
వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు చేసే ముందు పాదాల స్ట్రెచ్చింగ్ వర్కౌట్స్ చేయడం బెటర్. పాదం మీద ఎక్కువ భారం పడని స్విమ్మింగ్, సైక్లింగ్, వంటి ఎక్సర్ సైజులు చేయడం మంచిది.
అరికాలిలో నొప్పి వేధిస్తున్నప్పుడు ఒక బకెట్ లో గోరు వెచ్చని నీటిని తీసుకుని కొద్దిగా ఉప్పు కలిపి.. కాసేపు ఆ నీటిలో పాదాలను ఉంచాలి.
రెగ్యులర్ గా ఈ టిప్స్ ఫాలో అయితే అరికాలిలో నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అయితే, ఈ జాగ్రత్తలు పాటించినప్పటికి నొప్పి తగ్గకుండా అంతే ఉంటే డాక్టర్ ని సంప్రదించాలి. వారి సూచనల మేరకు మెడిసిన్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తన్నారు.