ప్రస్తుత కాలంలో ముఖంపై అవాంఛిత రోమాల సమస్యతో అనేక మంది స్త్రీలు బాధపడుతున్నారు. ఈ అవాంఛిత రోమాలు ముఖంపై, పెదవులపై, గడ్డంపై ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీంతో ఈ సమస్యను దూరం చేసుకోవడానికి అనేక రకాల చిట్కాలు పాటిస్తుంటారు. కానీ అనుకున్న మేరకు ఫలితాలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతుంటారు.
ఈ సమస్యకు కారణాలు..హార్మోన్ల అసమతుల్యత కారణంగా ముఖంపై ఇలా అవాంఛిత రోమాలు వస్తాయి. అందుకే ఇలాంటి వారు ఈ సింపుల్ చిట్కా పాటించి మంచి ఫలితాలను పొందండి. ఇంట్లోనే చాలా సులువుగా ఓ పేస్ట్ ను తయారు చేసుకుని వాడడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్దాలు: టమాట రసం, తేనె, పసుపు, జెలెటిన్ లు అవసరమవుతాయి. జెలెటిన్ మనకు బయట మార్కెట్ లో దొరుకుతుంది.
తయారీ విధానం: ముందుగా ఒక చిన్న స్టీల్ గిన్నెను తీసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ టమాట రసాన్ని లేదా ఒక టీ స్పూన్ నిమ్మ రసాన్ని తీసుకోవాలి. తరువాత అందులో ఒక టీ స్పూన్ తేనెను కలపాలి. తరువాత ఒక చిటికెడు పసుపును వేసి కలపాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ జెలెటిన్ ను కలపాలి. ఆ తరువాత ఒక పెద్ద గిన్నెలో నీటిని తీసుకుని నీటిని వేడి చేయాలి.
నీళ్లు వేడయ్యాక మనం తీసుకున్న స్టీల్ గిన్నెను ఆ నీటిలో ఉంచి జెలెటిన్ కరిగి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత గిన్నెను బయటకు తీయాలి. ఈ పేస్ట్ చల్లగా అయ్యి గట్టిపడడానికి ముందే ఉపయోగించాలి. మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ను అవాంఛిత రోమాల మీద అవి పెరుగుతున్న దిశలో మందంగా రాయాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత దానిని చేతి వేళ్లతో నెమ్మదిగా తొలగించాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.