కరివేపాకును తీసిపారేస్తున్నారా? అయితే ఈ ప్రయోజనాలు మిస్ అవుతున్నట్టే..

0
104

సాధారణంగా అందరు వంటల్లో కరివేపాకు వెయ్యడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఎందుకంటే రుచి, సువాసన బాగుంటుందనే కారణంతో వేస్తుంటారు. కానీ తినేటప్పుడు మాత్రం చాలామంది  కరివేపాకును తీసిపారేస్తారు. కానీ ఒక్కసారి ఈ లాభాలు తెలిస్తే మళ్ళి జీవితంలో కరివేపాకును పడెయ్యడానికి ఇష్టపడరు. మరి ఆలస్యం ఎందుకు ఆ లాభాలేంటో మీరు కూడా ఓ లుక్కేయండి..

కరివేపాకు తినడం వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా..జుట్టు, ఆరోగ్య సౌందర్యాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. కరివేపాకు జీర్ణశక్తి సంబంధిత సమస్యలను తొలగించడంతో పాటు..జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. కరివేపాకు వేర్లు శరీర నొప్పులనుతగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కరివేపాకులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.

అంతేకాకుండా కరివేపాకు కరివేపాకు చర్మం సంరక్షణకు కూడా సహాయపడుతుంది. గాయాలు అయినా స్థలాలలో, దురద ఉన్న ప్రాంతాలలో కరివేపాకు ఆకులు రసం లేదా పేస్ట్ రుద్దడం వల్ల ఆ సమస్య ఇట్టే తొలగిపోతుంది. పూర్వంలో పాము కాటు ఉపశమనం కోసం కరివేపాకు బెరడును ఉపయోగించేవారు. ముఖ్యంగా డయాబెటిక్ రోగుల దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.