కార్బోహైడ్రేట్స్ బియ్యంలో చాలా ఎక్కువ ఉంటాయి అని అందుకే ఈ మధ్య చాలా మంది రాత్రి పూట చపాతి పుల్కా ఇలా గోదుమ ఆహారం తింటున్నారు, కొందరు జొన్న రాగి సంగటి ఇలాంటివి కూడా తింటున్నారు, తృణ ధాన్యాలను ఈ మధ్య చాలా మంది వాడుతున్నారు, అయితే రైస్ లిమిట్ గా తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.
అంతేకాదు శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలని చూసే వారు చాలా మంది ఉంటారు, మీకు ఇది తెలుసా మనం తీసుకునే రైస్ వలన శరీరంలో రోగ నిరోధక శక్తి కొంతమేర పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.
దీనికి కారణం రైస్ లో మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహకరిస్తాయి. కొద్ది మొత్తంలో రైస్ తీసుకునే వారికి చాలా వరకూ అల్జీమర్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని స్టడీస్ చెప్తున్నాయి. రైస్ తో తయారు చేసిన గంజిని తీసుకుంటే మౌత్ అల్సర్స్ తగ్గుతాయని పలు పరిశోధనల్లో తేలిందట. అందుకే లిమిట్ గా రైస్ తీసుకుంటే మంచిదే.