బియ్యంలో పురుగులు పడుతున్నాయి ఇలా చేయండి

బియ్యంలో పురుగులు పడుతున్నాయి ఇలా చేయండి

0
121

మనం నిత్యం తినే ఆహరంలో రైస్ ఎంత ప్రముఖమైనవో తెలిసిందే.. బియ్యం ఎవరూ పారేసుకోరు, అందుకే అన్నం కూడా వండిన తర్వాత దానిని బయటపడేయడానికి ఇష్టపడరు, అయితే చాలా మందికి బియ్యంలో పురుగుల సమస్య ఉంటుంది. మరీ పాత బియ్యం ఉంటే కచ్చితంగా పురుగుల సమస్య ఉంటుంది ఇవి కొందరికి కనిపించక రైస్ లో కలిసిపోతాయి.

ఇలా బియ్యం డబ్బాలో, పప్పుల డబ్బాలో పురుగులు వస్తూనే ఉన్నాయి అని చాలా మంది విసుగుచెందుతారు. అయితే మీరు తీసుకునే జాగ్రత్తలతో పాటు ఈ జాగ్రత్తలు కూడా తీసుకోండి. కచ్చితంగా పురుగులు పట్టవు.

బియ్యాన్ని గాలివెళ్లని డబ్బాల్లో ఉంచడం వల్ల పురుగులు, కీటకాలను రాకుండా చూడవచ్చు అందులో బిరియానీ ఆకు లేదా కొన్ని వేపాకులు ఉంచితే పరుగులు పట్టవు. అలాగే లవంగాలు వేసినా మీకు పురుగులు పట్టవు, పొట్టు తీయని వెల్లుల్లి పాయలను బియ్యం డబ్బాలో వేసి, వాటి తేమ పోయాక బయటకు తీయాలి. ఇక బియ్యం కూడా వెంటనే ఎండలో వేస్తే తేమ పోయి పురుగులు ఉంటే చనిపోతాయి.పప్పులు బియ్యం ఇలా చేస్తే కచ్చితంగా ఆరునెలల వరకూ ఎలాంటి సమస్య ఉండదు.