అమెరికాని మళ్లీ వణికిస్తున్న కరోనా – పెరుగుతున్న డెల్టా వేరియంట్ కేసులు

Rising delta variant cases in America

0
80

కరోనా వైరస్ ప్రభావం ఇంకా తొలగిపోలేదు. కొన్ని దేశాల్లో కేసులు తగ్గినా మళ్లీ పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. మనకు కూడా ఫస్ట్ వేవ్ తర్వాత అందరూ కేసులు తగ్గుతాయి అని భావించారు. సెకండ్ వేవ్ ఎంత దారుణంగా విజృంభించిందో చూశాం. తాజాగా అమెరికాలో కూడా కేసులు తగ్గుతున్నాయని ఆనందంలో అక్కడ ప్రజలు ఉంటే, మళ్లీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం విలవిల్లాడింది. ఊహించని సంఖ్యలో యూఎస్ లో మరణాలు సంభవించాయి. ఇక టీకా ప్రక్రియ వేగంగా కొనసాగిస్తున్నారు. ముందు కేసులు తగ్గినా, తాజాగా డెల్టా వేరియంట్ అమెరికాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా డెల్టా వేరియంట్ కేసులు ఉన్నాయని వైద్య అధికారులు చెబుతున్నారు. కరోనా వేరియంట్లలో డెల్టా చాలా స్పీడుగా ఉందని వైద్యులు తెలియచేస్తున్నారు.

ఇప్పటికే పలు స్టేట్స్ లో అక్కడ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా అమెరికాలో వస్తున్న కేసుల్లో దాదాపు 80 శాతం కేసులు డెల్టా వేరియంట్ వే. కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నవారికి కూడా మళ్లీ కరోనా సోకుతోంది. కాని వారికి ప్రాణాపాయం ఉండదు అని చెబుతున్నారు. అందుకే ప్రతీ ఒక్కరు టీకా తీసుకోవాలి అని అమెరికా చెబుతోంది.