రోజు మాంసం తింటున్నారా ? మాంసం లేకపోతే ముద్దదిగదా? ఈ విషయం తప్పక తెలుసుకోండి

రోజు మాంసం తింటున్నారా ? మాంసం లేకపోతే ముద్దదిగదా? ఈ విషయం తప్పక తెలుసుకోండి

0
89

చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు, అసలు చికెన్ మటన్ ఫిష్ లేదా ఫ్రాన్స్ రొయ్యలు పీతలు ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ ఉండాలి.. లేకపోతే కంచం ముందే పక్కన పెట్టేస్తారు.. ఈ కరోనా సమయంలో ఇలాంటి వారు ఇంకా చికెన్ మటన్ కిలోల్లో తినేస్తున్నారు, ఇలా తినడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు వైద్యులు.

అయితే, అతి ఎప్పుడూ అనర్థమే అని గుర్తించుకోవాలి. చికెన్ ఎంత తినాలో అంత తినాలి లేకపోతే అతి ప్రమాదమే అవుతుంది, ఇక నాన్ వెజ్ వంటలు చిన్న పిల్లలు ఎక్కువగా తింటే వారికి ఎదుగుదలలో సమస్యలు వస్తాయి ఇలా ఎక్కువ మాంసం ఫుడ్ తింటే శరీరంలో యుక్తవయసులోనే వృద్ధాప్య ఛాయలు వస్తాయట.

మాంసాహారంలోని ఫాస్పేట్ల వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఇక మాంసం వారానికి లేదా నెలకి తినాలి అలాగే ఆకుకూరలు లాంటి ప్రోటీన్ ఫుడ్ తినాలి, ఆరోగ్యం సమతుల్యంగా ఉంటుంది.. అతిగా మాంసం తినడం వల్ల క్యాన్సర్, కాలేయ సమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.