చిన్నతనంలో ఏ కల్మషం లేకుండా నవ్వినట్టే పెద్దయ్యాక కూడా నవ్వితే ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు నిపుణులు ఉద్యోగాలు వ్యాపారాల బిజీలో పడి చాలా మంది నవ్వుకు దూరమవుతున్నారు… ఇలాంటి వారు కడుపుబ్బా నవ్వితే సమస్యలు కూడా తీరుతాయట…
నవ్వు ఒత్తిడిని తగ్గించే ఒక మెడిసిన్ అంటున్నారు అమెరికన్ వైద్యులు తాజాగా ఇదే అంశంపై అద్యాయణం చేసింది… ఈ అద్యాయణం ప్రకారం నవ్వు వల్ల మనసు ఉల్లాసపడి ఆలోచన శక్తి పెంచుతుందట…
నవ్వు ద్వారా ఒత్తిడి జయించవచ్చట… గట్టిగా నవ్వితే శరీరానికి అక్సీజన్ కూడా బాగా అందుతూ గుండెకు సంబంధించిన రోగాలు దూరమవుతాయట… నవ్వితే 108 కండరాలు ఉత్తేజం అవుతాయి… బీపీ అదుపులో ఉంటుంది…