రోజుకి ఎన్ని గుడ్లు తినాలి – పచ్చసొన తెల్లసొన ఏది మంచిది

రోజుకి ఎన్ని గుడ్లు తినాలి - పచ్చసొన తెల్లసొన ఏది మంచిది

0
88

చాలా మంది అతిగా గుడ్లు తింటూ ఉంటారు.. అయితే ఇలా ఎక్కువ వద్దు రోజుకి ఒకటి లేదా రెండు మాత్రమే తీసుకోవాలి అని డాక్టర్లు చెప్పినా కొందరు పట్టిందే పట్టు అన్నట్లు తీసుకుంటారు… అయితే పలు పరిశోధనల్లో దీనిపై తేలింది ఏమిటి అంటే ఎవరైనా ముందు ఓ గుడ్డు తీసుకోవాలి రెండో ఎగ్ తీసుకోవడానికి సుమారు రెండు గంటల విరామం ఇవ్వాలి.. ఇలా తీసుకుంటే జీర్ణ క్రియ సాఫీగా జరుగుతుంది.

 

కాదని ఒకేసారి రెండు లేదా మూడు గుడ్లు తీసుకుంటే జీర్ణ వ్యవస్ధ ప్రాబ్లంలో పడుతుంది, అందుకే ఇలా అస్సలు తీసుకోవద్దు.

అతిగా అంటే ఒకటికి మించి రెండు లేదా మూడు కొడిగుడ్లు ఒకేసారి తీసుకుంటే గుడ్డులో ఉండే పచ్చ సొనలో అధిక కొవ్వులు ఉంటాయి… దీనివల్ల గుండె పనితీరు నెమ్మదించి ప్రాణాలు పోతాయి… అంతేకాదు తెల్లసొన మీకు శరీరానికి మేలు చేస్తుంది.

 

మోతాదుకి మించి పచ్చ సొన తీసుకుంటే అది మీకు అనారోగ్యం తెచ్చిపెడుతుంది.గుండె ఆరోగ్యంగా ఉండాలంటే గుడ్డులోని తెల్ల సొన తీసుకోవాలి..అతిగాగుడ్డు తిన్నా కొవ్వు శాతం పెరుగుతుంది, ఇక్కడ మరో మాట చెబుతున్నారు వైద్యులు, ఇక జిమ్ చేసేవారు అయినా రెండు మించి గుడ్లు తీసుకోవద్దు అంటున్నారు వైద్యులు.