రోటీలు – బ్రెడ్ ఏది బెటర్ నిపుణులు ఏమంటున్నారు ?

Roti - Bread which is better Experts Say

0
85

చాలా మంది నైట్ పూట రోటీలు ప్రిఫర్ చేస్తున్నారు. రైస్ కంటెంట్ కంటే ఇదే బెటర్ అని చూస్తున్నారు. ముఖ్యంగా షుగర్ సమస్య రాకుండా రైస్ కాకుండా రోటీ చపాతీ తింటున్నారు. ఇక ఇటీవల మరికొందరు రోటీ బదులు బ్రెడ్ తీసుకుంటున్నారు. అలాగే బ్రౌన్ బ్రెడ్ తింటున్నారు. మార్కెట్ లో వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టీ గ్రెయిన్ బ్రెడ్తో సహా అనేక రకాల బ్రెడ్లు అందుబాటులో ఉన్నాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం రోటీ అనేది గోధుమ రోట్టే కంటే ఉత్తమం. అయితే బ్రెడ్ విషయంలో చూసుకుంటే ఇది ప్రాసెస్ చేసిన ఫుడ్ అవుతుంది. దీనిలో ఈస్ట్ కలుస్తుంది. ఇది అంత మంచిది కాదు. ఆరోగ్యానికి ఏదో అప్పుడప్పుడూ పర్వాలేదు కాని రోజూ తినడం మంచిది కాదు.

రోటీలో కార్బోహైడ్రేట్స్, కరిగే ఫైబర్, ప్రోటీన్స్తో ఫైబర్లు, తృణ ధాన్యాలను కలిగి ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఈజీగా అరుగుతుంది అయితే బ్రెడ్ లో మాత్రం ఈస్ట్ ఉంటుంది. శరీరాన్ని ఇది డీ హైడ్రేడ్ చేస్తుంది. అందుకే ఈ బ్రెడ్ల కంటే రోటీలు ఉత్తమం అంటున్నారు నిపుణులు. అయితే మైదాతో చేసిన రోటీలు వద్దు గోధుమ పిండితో చేసిన రోటీలు తినడం ఉత్తమం అని చెబుతున్నారు నిపుణులు.