కొత్త మొక్క కనిపెట్టిన శాస్త్రవేత్తలు దాని పేరేంటంటే

Scientists who discovered the new plant

0
73

ఈ భూమిమీద నిత్యం అనేక రీసెర్చులు జరుగుతూ ఉంటాయి. అనేక రకాల మొక్కలు జంతువులు వృక్షాలపై సర్వేలు రీసెర్చులు చేస్తూనే ఉంటారు. ఇలాంటి సమయంలో కొన్ని కొత్త మొక్కలు జంతువులు కనిపిస్తాయి. వాటిని గుర్తించి వాటికి ఓ పేరు పెట్టడం జరుగుతుంది. తాజాగా అదే జరిగింది ఇక్కడ ఈ మొక్కని మీరు చూడవచ్చు. తాజాగా భారతీయ శాస్త్రవేత్తలు ఈ కొత్త వృక్ష జాతి మొక్కను కనుగొన్నారు.

అండమాన్ లోని అర్చిపెలాగో దీవుల్లో ఈ కొత్త మొక్కని గుర్తించారు. 2019లో ఆ దీవులకు వెళ్లిన వృక్ష శాస్త్రవేత్తలకు ఆ మొక్క కనిపించింది. ఇప్పటి వరకూ ఎక్కడా చూడని మొక్క కావడంతో దానిని గుర్తించారు. దానికి ఆ మెరైన్ గ్రీన్ ఆల్గేకు జలకన్య మెరమైడ్ అని పేరు పెట్టారు. అయితే ఇలాంటి కొత్త మొక్కలు కనిపెడితే ఇవి ఇంకా ఎక్కడైనా ఎవరైనా గుర్తించారా అనేది కూడా పరిశోధన చేయాలి. దీని కోసం ఇలా రెండు సంవత్సరాలు పట్టిందట.

ఇది కొత్త రకం మొక్క అని తేలింది. పంజాబ్ సెంట్రల్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఆ మొక్కకు అసిటబులేరియా జలకన్యకే అన్న శాస్త్రీయ నామాన్ని పెట్టారు. మొక్క ఒకే ఒక్క భారీ కణంతో తయారైనట్లు నిపుణులు తెలిపారు