మనకు ఏదైనా జలుబు చేసినా జ్వరం వచ్చినా లేదా ముక్కు దిబ్బడ పడిసం గొంతు నొప్పి కఫం వచ్చినా వెంటనే మన తాతలు నానమ్మ అమ్మమ్మలు పెద్దలు చెప్పేది ఒకటే… ఓ గ్లాసు పాలు వేడిగా తీసుకుని అందులో అర స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిపి తాగాలి అని చెబుతారు. మరికొందరు ఇది వేడి చేస్తుంది వద్దు అంటారు… సో వైద్యులు ఏమి చెబుతున్నారు ఇది ఎంత వరకూ పనిచేస్తుంది అనేది చూద్దాం.
మీకు గొంతులో సమస్యలు, దగ్గు, జలుబు వంటివి ఉంటే… రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి పాలలో అర టీస్పూన్ పసుపు కలిపి తాగేయాలి. ఇక ప్లేవర్ కోసం మీరు నల్ల మిరియాలు పొడి వేసుకున్నా మంచిదే, ఇలా తాగితే గొంతులో కిరికిరి సమస్యలు తగ్గుతాయి.
సో దీని వల్ల వేడి చేస్తుంది అని అనుకోవక్కర్లేదు, పసుపు అనేది యాంటీబయోటిక్. మన శరీరంలో ఉండే రకరకాల వైరస్లు, క్రిములు, విష వ్యర్థాలను పసుపు తరిమేస్తుంది. ఇక ఇమ్యునిటీ పవర్ కూడా బాగా పెంచుతుంది, అందుకే ఇలా పసుపు పాలు తాగితే మీకు ఆరోగ్యం ఉంటుంది…గొంతులో కఫం లాంటివి పేరుకుపోకుండా ఉంటుంది. రాత్రి సరిగ్గా నిద్ర పట్టని వారు కూడా ఇలా తీసుకోవచ్చు..ఇలా పాలల్లో పేగుల దగ్గరకు వెళ్లి… అక్కడి పురుగులు, క్రిములను పట్టుకొని చంపేస్తుంది, ఇక జీర్ణ వ్యవస్ద బాగుంటుంది.
ReplyForward
|