స్నేహితులు కలిస్తే చాయ్ తాగాల్సిందే. ఇంటికి వచ్చిన అతిథులకు టీ ఆఫర్ చేయాల్సిందే. అంతలా దైనందిన జీవితంలో మమేకమైంది. టీ విషయంలో వినియోగదార్ల అభిరుచుల్లో మార్పు వచ్చింది. యువతరం కొత్తదనం కోరుకుంటున్నారు.
అందుకు అనుగుణంగా తులసి టీ, అల్లం టీ, ఇలాచీ టీ, మాసాలా టీ, ఫెన్నెల్ టీ, లైకోరైస్ టీ ఇలా ఎన్నో రకాల టీలు మన దేశంలో లభిస్తాయి. అయితే చలికాలంలో అల్లం టీని ఎక్కువగా తాగుతుంటారు. అల్లం టీ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా..తలనొప్పి తగ్గించి మానసిక ప్రశాంతత అందిస్తుంది. అయితే అల్లం టీ తీసుకోవడం వలన కూడా అనేక ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
అల్లంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కానీ అల్లంను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానీ కలిగే అవకాశం ఉంది. అల్లం టీని ఎక్కువగా తీసుకుంటే కడుపు సమస్యలు పెరుగుతాయి. మరోవైపు అల్లం టీని ఎక్కువగా తీసుకోవడం వలన గ్యాస్ సమస్య పెరుగుతుంది. అలాగే శరీరానికి విశ్రాంతి లేమి సమస్య పెరుగుతుంది.
అలాగే అల్లం టీని ఎక్కువగా తాగడం ద్వారా తల తిరగడం, బలహీనంగా మారడం వంటి సమస్యలు ఏర్పడతాయి. అంతేకాకుండా.. అల్లం టీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. అల్లంలో ఉండే జింజెరాల్ అనే మూలకం జుట్టు పెరుగుదలను నిరోధిస్తుంది. దీంతో జుట్టు రాలే సమస్య తీవ్రమవుతుంది. అందుకే అల్లం టీ తీసుకోవడం తగ్గించాలి. ఇక ముఖ్యంగా అల్లం టీని ఎక్కువగా తీసుకుంటే నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి. దీంతో శరీరం తొందరగా అలసిపోతుంది. బలహీనత కూడా పెరుగుతుంది. రాత్రి సమయంలో అల్లం టీ అస్సలు తీసుకోవద్దట.