Orange Benefits | శీతాకాలంలో నారింజ పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..!

-

Orange Benefits | శీతాకాలం అంటేనే ఎముకలు కొరికే చలి, కారుతున్న ముక్కు, వైరల్ జ్వరాలే గుర్తొస్తాయి. వీటి భయంతోనే చాలా మంది సీజనల్ ఫ్రూట్స్ అయిన నిమ్మజాతి పండ్లను తినడానికి భయపడుతుంటారు. ఏం తింటే ఏమొచ్చి పడుతుందో అన్న భయంభయంగా ఉండాల్సి వస్తుంది. కానీ వైద్యులు మాత్రం సీజనల్ ఫ్రూట్స్‌ను తప్పకుండా తినాలని, వాటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయని చెప్తుంటారు.

- Advertisement -

కానీ నారింజ వంటి పండ్లను తింటే ఎక్కడ ఫ్లూ వస్తుందో అన్న భయం అందరిలో ఉంటుంది. అందుకే వీటి పేరు చెప్తేనే ఆమడ దూరం వెళ్తారు. వీటిని తినడానికి పిల్లలు ఆసక్తి చూపినా.. జలుబు చేస్తుందనో, జ్వరం వస్తుందనో పెద్దలు చెప్తుంటారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం వేరేలా చెప్తున్నారు. శీతాకాలంలో నారింజ వంటి సీజనల్ ఫ్రూట్స్‌ను తప్పకుండా తినాలంటున్నారు. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు రావడం కాదు కదా.. ఉన్నవి కూడా చాలా వరకు సమసిపోతాయని వివరిస్తున్నారు.

ముఖ్యంగా నారింజ గురించి మాట్లాడుకుంటే.. శీతాకాలంలో వీటిని తింటే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చట. శీతాకాల సమయంలో వారంలో రెండు మూడు సార్లైనా నారింజ పండ్లను తినాలని చెప్తున్నారు. మరి నారింజ పండ్లను తినడం ద్వారా ఎటువంటి లాభాలు(Orange Benefits) ఉన్నాయో ఒకసారి చూద్దామా..

ఇమ్యూనిటీ బూస్టర్: శీతాకాలంలో నారింజ పండ్లను తినడం ద్వారా మన రోగనిరోధక శక్తిని అమితంగా పెరుగుతుందని చెప్తున్నారు వైద్యులు. శీతాకాలంలో అధికంగా ఉండే చలి వల్ల అనేక రోగ సమస్యలు వస్తుంటాయి. అదే విధంగా మన రోగనిరోధక శక్తి కూడా చాలా బలహీనంగా ఉంటుంది. నారింజలో ఉండే విటమిన్-సీ మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దాని రెస్పాన్స్ టైమ్‌ను తగ్గిస్తుంది. తద్వారా మన పూర్తి ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా నారింజ కీలక పాత్ర పోషిస్తుంది.

కడుపు ఆరోగ్యం: నారింజలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగులను బాగా శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. చలికాలంలో మన జీర్ణవ్యవస్థ సహజంగానే మందగిస్తుంది. కానీ నారింజ పండ్లు తినడం ద్వారా మన జీర్ణ వ్యవస్థ ఉత్తేజితమైన.. వేగంగా పనిచేస్తుందని, పేగు ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు అంటున్నారు.

అధిక బరువు: బరువు తగ్గాలని అనుకునే వారికి నారింజ అద్భుత ఔషధమని వైద్యులు చెప్తున్నారు. నారింజలో ఫైబర్ స్థాయిలు అధికంగా ఉండటంతో పాటు పీచు పదార్థం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఆకలిని నివారిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. దానికారణంగా బరువు తగ్గడంలో నారింజ కీలక పాత్ర పోషిస్తుంది.

గుండె పదిలం: శరీరంలో పొటాషియం స్థాయిలు తగ్గిన సమయంలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాగా ఆ పోటాషియం స్థాయిల్లో వచ్చే గ్యాప్‌లను నారింజలు ఫిల్ చేస్తాయి. నారింజల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీంతో నారింజ పండ్లను తరచుగా తీసుకోవడం ద్వారా హృదయ నాళాలు బలోపేతం చెంది.. గుండె సరిగ్గా పనిచేయడానికి దోహపడతాయి.

కిడ్నీలో రాళ్లు: కిడ్నీల్లో రాళ్ల సమస్య ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తుంది. చాలా మంది ఈ సమస్యకు ఏం చేయాలో అర్థం కాక.. ఆపరేషన్లు చేయించుకుంటుటారు. కానీ నారింజ పండ్లను తరచుగా తినడం ద్వారా కిడ్నీలో రాళ్ల నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సులభతరం అవుతుంది. నారింజలో ఉండే సిట్రిక్ యాసిడ్.. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచి మూత్రంలో సిట్రేట్ స్థాయిని పెంచుతుంది. తద్వారా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది.

మెరిసే చర్మం: నారింజలో పుష్కలంగా ఉండే సీ, ఇ విటమిన్లు మన చర్మ ఆరోగ్యానికి ప్రధాన వాహకాలుగా పనిచేస్తాయి. నారింజ పండ్లను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మంలో ఉండే మలినాలు బయటకు వెళ్లిపోతాయి. ముఖంపై ముడతలు తగ్గుతాయి. చర్మ కణాలను పునరుత్పత్తి చెందుతాయి. బ్లాక్ హెడ్స్, మచ్చలను తొలగిస్తుంది.

Read Also: సోంపుతో సూపర్ ప్రయోజనాలు..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ponnam Prabhakar | ఆటో డ్రైవర్ల కష్టాలకు బీఆర్ఎస్సే కారణం: పొన్నం ప్రభాకర్

ఆటో డ్రైవర్ల(Auto Drivers) సమస్యలపై బీఆర్ఎస్ నేతలు ఈరోజు అసెంబ్లీలో నిరసన...

KTR | ఆటోవాలాగా మారిన కేటీఆర్.. ఎందుకోసమంటే..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).. ఆటోవాలాగా మారారు. అసెంబ్లీకి...