సీతా ఫలాలు(Custard Apples).. వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మన జీర్ణప్రక్రియను మెరుగు పరచడం దగ్గర నుంచి డిప్రెషన్ తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం, గెండెజబ్బులను దూరం చేయడం ఇలా మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అదే విధంగా సితాఫలాలను తిరడం వల్ల కొన్ని సమస్యలు కూడా తప్పకుండా వస్తాయని వైద్యులు చెప్తున్నారు. క్యాన్సర్‌ను కూడా దూరం చేసే సీతాఫలాలు.. మన మెదడు, నాడీ వ్యవస్థను ఎంతగానో ప్రభావితం చేస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇందుకు సీతా ఫలాల్లో అధికంగా ఉండే ఆనోనాసిన్ అనే టాక్సిన్ కారణమని చెప్తున్నారు నిపుణులు. దీని వల్ల పార్కిన్సన్స్ సమస్య కూడా రావొచ్చని చెప్తున్నారు. ఇప్పటికే నాడీ వ్యవస్థ సంబంధిత లేదా మెదడు సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న వారు సీతాఫలాలకు దూరంగా ఉండటమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ అనోసిన్ అనే టాక్సిన్.. సీతాఫలం గింజలు, తోలులో అధికంగా ఉంటాయి. కాబట్టి తినే వారు.. ముందుగానే వీటిని తొలగించి సీతాఫలాల్లో ఉండే తెల్లటి గుజ్జును మాత్రమే తీసుకోవాలని వైద్యులు వివరిస్తున్నారు. అదే విధంగా మధ్యలో గుజ్జును కూడా షుగర్ వ్యాధి ఉన్న వారు పరిమితంగానే తినాలని సూచిస్తున్నారు. సీతాఫలాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటిని పరిమితంగానే తినాలని అంటున్నారు.
సీతాఫలాల్లో(Custard Apples) ఉండే పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి. సీతా ఫలాలు కంటి చూపును మెరుగు పరచడంలో కూడా కీలకంగా పనిచేస్తాయి. వీటిలోఉండే విటమిన్ బీ6 మన మానసిక స్థితిని కంట్రోల్ చేయడం కీలకంగా పనిచేస్తుంది. వీటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియంలో బీపీని కంట్రోల్ చేస్తాయి. సీతాఫలాలు తినడం ద్వారా మన రోగ నిరోధక శక్తి బలపడుతుంది.