Roti Side Effects | రోజూ రోటీలు లాగించేస్తున్నారా.. ఈ సమస్యలు తప్పవు..

-

Roti Side Effects | బరువు తగ్గాలని అనుకునేవారు, పర్పెక్ట్ డైట్ మెయింటెన్ చేయాలనుకునే వారు చాలా వరకు వారి ఆహారంలో మార్పు చేస్తారు. అది కూడా అధికశాతం రాత్రి పూట భోజనాన్ని రోటీలతో రీప్లేస్ చేసుకుంటారు. మంచిదే కదా అని రోటీలను ప్రతి రోజూ లాగించేస్తుంటారు. కానీ ఇలా చేయడం కూడా తీవ్ర అనారోగ్యాలకు దారి తీస్తుందని, రోజూ రోటీలు తినడం వల్ల కొన్ని సమస్యలను కోరి తెచ్చుకున్నట్లే అవుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. పోషకాహార నిపుణులు కూడా ఇది వాస్తమేనని అంటున్నారు. బరువు తగ్గాలని అనుకునే వారు రోజుకో వెరైటీ డైట్ ఫుడ్ తీసుకోవచ్చని, కానీ ప్రతి రోజూ రోటీలే తింటే మాత్రం తిప్పలు తప్పవని అంటున్నారు.

- Advertisement -

ప్రతి రోజూ ఒకపూట రోటీలు తింటే మూడు నెలలకల్లా కొవ్వు కరిగి ఫ్లాట్ పొట్ట వస్తుందని కొందరు అనుకుంటే.. రాత్రిపూట భోజనం మానేసి రోటీలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయని మరికొందరు భావించి ఈ డైట్‌లోకి దిగుతారు. కానీ ప్రతి రోజూ రోటీలను తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్నే సమస్యలు కూడా వస్తాయని, ఈ సమస్యలు ఉన్నవారు రోటీలను రోజూ తింటే ఆ సమస్య మరింత అధికమవుతుందని అంటున్నారు నిపుణులు. మరి రోటీలతో అంతటి సమస్యలు ఏమొస్తాయో ఒకసారి తెలుసుకుందామా..

గుండె సమస్యలు: రోజూ రోటీలు తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు వైద్య నిపుణులు. గోధుమల్లో ఉండే కార్బోహైడ్రేట్లు మన శరీరంలో కొవ్వు పెరుగుతుంది. తద్వారా రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి గుండెకు పనిభారం అధికమవుతుంది. అది ఎక్కువ అయినప్పుడు గుండె సంబంధిత రోగాలు అనేకం వస్తాయి.

అధిక బరువు: గోధుమల్లో పుష్కలంగా ఉండే కార్బోహైడ్రేట్లు మన బరువు పెరగడానికి అద్భుతంగా పనిచేస్తాయి. వీటివల్ల కొవ్వు పెరిగి తక్కువ సమయంలోనే అధికంగా బరువు పెరుగుతాం. రోజూ రోటీలు తినడం వల్ల బరువు తగ్గడమేమో కానీ బరువు పెరగడం మాత్రం ఖాయం.

థైరాయిడ్: థైరాయిడ్ సమస్య ఉన్న వారు గోధుమలకు వీలైనంత దూరంగా ఉండాలి. గోధుమల్లో ఉండే గ్లూటెల్ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ సమస్యల ప్రమాదాన్ని అధికం చేస్తుంది. దీని వల్ల థైరాయిడ్ సమస్య కూడా పెరుగుతుంది. కాబట్టి థైరాయిడ్ సమస్య ఉన్న వారు గోధుమ పిండి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిదని, వాళ్లు డైట్ మెయింటెన్ చేయాలనుకుంటే రొట్టెలకు బదులుగా మరేమైనా ట్రై చేయడం మంచిదని నిపుణులు అంటున్న మాట.

నీరసం: నీరసంగా ఉన్న సమయంలో గోధుమ రొట్టెలను తింటే నీరసం తగ్గకపోగా అధికమవుతుందని నిపుణులు అంటున్నారు. వీటిలో అధికంగా ఉండే కార్బోహైడ్రేట్లు అలసటను అధికం చేస్తాయని, రోటీలను ఎంత ఎక్కవగా తీసుకుంటే నీరసం అంత పెరుగుతుందని, మరికొందరికి ఈ కారణంగానే ఎన్ని తిన్నా ఆకలి తీరిన ఫీలింగ్ రాదని పోషకాహారా నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఏం చేయాలంటే: రొట్టెలు మన ఆరోగ్యానికి మంచిదే అయినా వాటిని రోజూ తీసుకుంటే ఈ సమస్యలు వస్తాయి. కానీ వారంలో ఒకటి రెండు సార్లు తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని అంటున్నారు నిపుణులు. కాగా ఆ తినే ఒకటి రెండు రోజులు కూడా వరుసగా కాకుండా మధ్య రెండు మూడు రోజులు గ్యాప్ వచ్చేలా చూసుకోవాలని వివరిస్తున్నారు. మిగిలిన రోజుల్లో ఇతర డైట్ ఫుడ్స్‌ను ట్రై చేయొచ్చని, ఓట్స్, సలాడ్స్ వంటి వాటిని తినడం అలవాడు చేసుకోవచ్చని అంటున్నారు.

Roti Side Effects | లేదు రోజూ రోటీలే తినాలి అనుకుంటే మాత్రం రెండుకు మించి రొట్టెలు తినొద్దంటున్నారు. ఆ రెండు రొట్టెలకు అధికంగా ఫైబర్ ఉండే కూరలను ఎక్కువగా తీసుకోవాలని చెప్తున్నారు నిపుణులు. కూర ఎక్కువగా తినడం ద్వారా ఈ సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు కంట్రోల్ చేయొచ్చని చెప్తున్నారు. అయితే ఎంత ప్రయత్నించినా డైట్ మార్చిన కొద్ది రోజుల్లోనే ఏమైనా ఆరోగ్యం తేడాగా అనిపిస్తే మాత్రం డాక్టర్‌ను కన్సల్ట్ అవ్వాలని, వైద్యులు చెప్పిన దాని ప్రకారం డైట్‌లో మార్పులు చేర్పులు చేసుకోవాలని నిపుణులు వెల్లడిస్తున్నారు.

Read Also: తెల్లని చర్మం కోసం తేలికైనా చిట్కాలు..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...