చెమటకు వెంటనే చెక్ పెట్టే సింపుల్ చిట్కాలివే?

0
101

సాధారణంగా చాలామందికి చెమట పట్టి చిరాకుగా అనిపిస్తుంది. ముఖ్యంగా వేసవిలో మన శరీరాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకున్న చెమట పట్టి దుర్వాసర కారణంగా అసౌకర్యంగా అనిపిస్తుంది. అయితే ఈ చెమటకు చెక్ పెట్టడానికి అనేక రకాల మందులు వాడుతుంటారు. కానీ అవి వాడడం వల్ల శరీరంపై ప్రభావం పడి హాని చేకూరే అవకాశం ఉంటుంది.

అందుకే ఎలాంటి ఖర్చు లేకుండా సాధారణ చిట్కాలతో ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. బేకింగ్ సోడా ద్వారా శరీర దుర్వాసనను పోగొట్టడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడాను చెమట పట్టే ప్రాంతాల్లో రాస్తే ఆ ప్రాంతం ఎల్లప్పుడూ పొడిగా ఉండి దుర్వాసన రాకుండా చేస్తుంది. అంతేకాకుండా చెమట పట్టే ప్రాంతంలో వేడినీళ్లతో రోజుకు రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవడం మంచిది.

ఇంకా నిమ్మకాయ కూడా బాక్టీరియాను  చంపడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు చెక్కలుగా కోసి వాటిని చంకల కింది భాగంలో రుద్దడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. దుర్వాసన పోయే వరకూ రోజ్ ఇలా చేస్తూ ఉండాలి. అంతేకాకుండా మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.