కాళ్ళ పగుళ్లను తొలగించే సింపుల్ చిట్కాలివే..!

0
109
care for beautiful woman legs

కాళ్ళు అందంగా కనపడాలని అందరు కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు కాళ్ళ మడమలు పగుళ్ళను తొలగించుకోవడానికి అనేక డబ్బులు ఖర్చు చేసి వివిధ రకాల అంటిమెంట్స్ వాడుతుంటారు. కాళ్ళపై పేరుకున్న మృతకణాలను తొలగించకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. సరిపడా నీళ్ళు తాగడపోవడం కూడా దీనికి ఒక కారణం.

ఇంకా  అధిక బరువు ఉండడం,ఎత్తు చెప్పుల వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగదు, పోషకాహార లేమితో ఇలాంటి పాదాల సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఈ చిట్కాలు పాటిస్తే సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి ఆ నీటిలో పాదాలను నానబెట్టి పది నిమిషాల తర్వాత కాళ్ళని మర్దనా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి కాళ్ళు మృదువుగా మారుతాయి.

బియ్యంపిండి, ఆపిల్ సిడార్ వెనిగర్, తేనె కలిపి ఈ మిశ్రమాన్ని మోకాళ్ల కు అప్లై చేసి మృదువుగా మసాజ్ చేసిన తర్వాత శుభ్రం చేసి నూనె లేదా పుట్ మాయిశ్చరైజర్ రాయడం వల్ల నునుపుగా ఉంటాయి. ఇలా తరచు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.  రాత్రి పడుకునే ముందు పెట్రోలియం జెల్లి రాసుకుని  సాక్సులు పాదాలకు వేసుకుని పడుకుంటే కాళ్ల సమస్యలు తొలగిపోతాయి.