మొటిమలను తగ్గించే సింపుల్ చిట్కాలివే..

0
82

ప్రస్తుతం మహిళలకు మొటిమల సమస్య పెద్ద సవాల్ గా మారింది. చిన్నాపెద్దా అని తేడా లేకుండా అందరిని ఈ సమస్య వేధిస్తుంది. దాంతో మహిళలు ఈ సమస్య నుండి బయటపడడానికి వివిధ రకాల లోషన్​లు, క్రీమ్స్ వాడుతూ..వివిధ ఆరోగ్యసమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. అందుకే క్రీమ్స్ తో కాకుండా ఈ సింపుల్ చిట్కాలతో మొటిమల సమస్యను దూరం చేసుకోవచ్చు.

మగవారు మరియు ఆడవారు ఇద్దరిలోను అధిక ఆండ్రోజెన్ హార్మోన్లు ఉత్పత్తి, టెస్టోస్టెరాన్, డైహైడ్రోటెస్టోస్టెరోన్ , డి హైడ్రో ఎపింద్రోస్తేరోనే సల్ఫేట్ కారణంగా మొటిమలు వస్తాయి. టూత్ పేస్టు మొటిమలను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది తేమను దూరంగా ఉంచి మొటిమలను తగ్గిస్తుంది.

ఇంకా ఒక నిమ్మకాయను తీసుకుని సగానికి కట్ చేసి నిమ్మ ముక్కతో మొటిమల పైభాగంలో రుద్దడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. రెండు వెల్లుల్లి,లవంగాలను తీసుకోని బాగా క్రష్ చేసి రసం తీయాలి. ఈ రసాన్ని మీ ముఖం మీద పట్టించి 10 నిమిషాలు తర్వాత కడగడం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడం మీరే గమనిస్తారు.