మనం అందంగా కనిపించాలంటే ఆరోగ్యకరమైన జుట్టు అవసరమని అందరికి తెలిసిందే. తల వెంట్రుకలు డ్యామేజీ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. లేదంటే వివిధ చర్మ సమస్యలతో పాటు జుట్టు సంబంధిత సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా చుండ్రు సమస్య ఒకటి.
డాండ్రఫ్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. విటమిన్ల లోపం, దీర్ఘకాలిక అరోగ్య సమస్యలు, నీళ్లు పడకపోవడం, ఒత్తిడి వంటి అనేక కారణాలతో చుండ్రు వస్తుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే ఈ చుండ్రు సమస్య నుంచి బయటపడేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా ఇంట్లో అందరూ ఒకే దువ్వెనతో తల దువ్వుకుంటారు. కానీ అలా చేయడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని సార్లు ఒకరి తలలో ఉండే ఇన్‌ఫెక్షన్లు, వైరస్‌లు దువ్వెనల ద్వారా ఇతరులకు వ్యాపిస్తాయి. కనుక ఎవరి దువ్వెనలను వారు వాడితేనే మంచిది.
బేకింగ్ సోడాను తలపై పోసి బాగా మర్దనం చేయడం ద్వారా కూడా డాండ్రఫ్‌ను నివారించుకోవచ్చు. కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని తడి జుట్టుకు బాగా రాయాలి. అనంతరం 2 నిమిషాలు ఆగి షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.