కళ్ల మంటలు తగ్గించే సింపుల్ చిట్కాలివే..!

0
85

చాలా మంది ఎక్కువగా బాధపడే సమస్యలలో కళ్ళ మంటలు కూడా ఒకటి. ఈ సమస్య మరింత అధికం అయితే తీవ్ర కంటిమంటతో ఇబ్బందిపడవల్సి ఉంటుంది. ఈ సమస్యకు బాక్టీరియా లేదా వైరల్ సంబంధించి కంటి వ్యాధులు,కాలుష్యం మరియు సూర్యుని కిరణాలు వంటి కారణాలు ఉండవచ్చు.

కొన్నిసార్లు పుప్పొడి,దుమ్ము మరియు ఇసుక వంటి సహజమైన చికాకు కారణంగా కూడా కళ్ళు మండే ప్రమాదం ఉంటుంది.  ఇంకా అధికంగా చదవటం మరియు రసాయన చికాకు గురికావడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ సమస్యను ఎలాంటి ఖర్చు లేకుండా మీ వంటగదిలో సులభంగా అందుబాటులో ఉండే బంగాళదుంపలు,దోసకాయ,బేకింగ్ సోడా,ఆముదము,టీ బ్యాగ్స్,కలబంద రసం వంటి వాటిని ఉపయోగించవచ్చు.

మీరు మీ కనురెప్పలపైన బంగాళాదుంప ముక్కలను ఉంచవచ్చు. దానిని కనీసం 15 నిమిషాలు ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల కంటి మంట తగ్గుతుంది. మీ కళ్ళు బర్నింగ్ గా ఉంటే ఐస్ కోల్డ్ వాటర్ చల్లండి. అప్పుడు ఆ నీరు మీ కళ్ళ నుండి దుమ్ము కణాలు మరియు మలినాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాక వాటికి వచ్చే వాపులకు ఉపశమనం కలిగిస్తుంది.