ఒకేసారి ఆనందం..కేలరీల ఖర్చు..శృంగారంతోనే సాధ్యం!

Simultaneous pleasure..calorie expenditure..it is possible only with eroticism!

0
105

ఒకవైపు ఆనందం..మరోవైపు కేలరీల ఖర్చు. అదెలా అని ఆలోచిస్తున్నారా? శృంగారంతో సాధ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి సెక్స్ చేయటం వల్ల ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయో తెలుసా? సెక్స్ చేసే సమయంలో ఎవరిలో ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి? ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నిజానికి శృంగారమనేది వ్యాయామ పద్ధతి కాదు గానీ ఇది కూడా కొంతమేరకు వ్యాయామంగా తోడ్పడుతుండటం విశేషం. కేలరీల విషయం పక్కనపెట్టి చూసినా..శృంగారంతో మానసిక ఆరోగ్యం, మూడ్‌ మెరుగుపడతాయి. వ్యాయామం చేసినంతగా కాకపోయినా శృంగారంలో పాల్గొన్నప్పుడూ కేలరీలు ఖర్చు అవుతాయి మరి. సుమారు అరగంట సేపు ఒక మోస్తరు వేగంతో పరుగెత్తితే సగటున మహిళల్లో 213 కేలరీలు, పురుషుల్లో 276 కేలరీలు ఖర్చు కాగా.. శృంగారం మూలంగా మహిళల్లో 69 కేలరీలు, పురుషుల్లో 101 కేలరీలు ఖర్చు కావటం గమనార్హం.

మగవారిలో ఎక్కువ కేలరీలు ఎందుకు ఖర్చవుతున్నాయో తెలుసా? ఆడవాళ్ల కన్నా మగవాళ్లు ఎక్కువ బరువు ఉండటం..ఆ సమయంలో మగవారు కాస్త చురుకుగానూ ఉండటం వల్లనేనని పరిశోధకులు చెబుతున్నారు. నిద్ర తక్కువైతేనే కాదు.. ఎక్కువైనా ఇబ్బందే. అందుకే రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయం పెందలాడే లేవాలని చెబుతుంటారు. ఇది శాస్త్రీయంగానూ రుజువైంది. ఇప్పుడు దీనికి సంబంధించి మరో కొత్త విషయం బయటపడింది. నిద్ర మరీ తగ్గినా, మరీ ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యత దెబ్బతింటున్నట్టు పరిశోధకులు గుర్తించారు.