Skincare Tips | వేసవి వస్తుందంటే సవాలక్ష సమస్యలు కూడా ఇబ్బంది పెట్టడానికి రెడీగా ఉంటాయి. చలికాలం నుంచి ఒక్కసారిగా ఎండాకాలం రావడం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పులు మన చర్మ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందులోనూ మండే ఎండలు ఉండే వేసవిలో చర్మం ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకోవడం అంటే కత్తిపైన సామనే చెప్పాలి. వేసవిలో చర్మంలో నీటి శాతం బాగా తగ్గిపోయి.. నూనె శాతం పెరుగుతుంది. దానికి తోడు పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల మన చర్మంపై కొన్నికొన్ని సందర్భాల్లో మచ్చలు కూడా ఏర్పడతాయి.
వేసవిలో వచ్చే చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి, చర్మ సౌందర్యాన్ని కోల్పోకుండా ఉండటానికి యువత అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల క్రీములు కూడా వినియోగిస్తారు. అయినా చాలా సందర్భాల్లో లాభం ఉండదు. అధిక చెమటతో చర్మ రంధ్రాలు మూసుకుపోయి చర్మం నిర్జీవంగా తయారవుతుంది. ఇలాంటి సమస్యకు ది బెస్ట్ సొల్యూషన్ ఏమైనా ఉందంటే అది నేచురల్ స్క్రైబ్. దీనిని ఉపయోగించడం ద్వారా వేసవిలో మన చర్మం సాధారణ కాంతిని కోల్పోకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ స్క్రబ్ అనేది మృతకణాలను తొలగించి చర్మాన్ని కాపాడుతుంది. కాగా ఈ స్క్రబ్‌తో రోజుకు మూడు సార్లు మొఖం కడుక్కోవాల్సి ఉంటుంది.
మాయిశ్చరైజర్: వేసవిలో మాయిశ్చరైజర్ వినియోగించే తీరులో పలు మార్పులు చేసుకోవాలి. శీతాకాలంలో వినియోగించే హెవీ మాయిశ్చరైజర్ సమ్మర్‌లో పనికిరాదు. వేసవికి తేలికపాటి, వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్‌ను వినియోగించాలి. ఇది చర్మానికి కావాల్సిన తేమను అందిస్తూ అధిక చెమట సమస్యను తగ్గిస్తుంది.
సన్‌స్క్రీన్: వేసవవిలో సన్‌స్రీన్ వినియోగం కూడా చాలా ముఖ్యం. సాధారణంగా చాలా మంది బయటకు వెళ్లే సమయాల్లో సన్‌స్క్రీన్ ఉపయోగిస్తారు. కానీ ఇంట్లో ఉన్న సమయంలో కూడా సన్ స్క్రీన్ వినియోగించడం ఉత్తమ ఫలితాలను అందిస్తుందని నిపుణులు చెప్తున్నారు. వేసవిలో అధికంగా వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి మన చర్మాన్ని కాపాడటానికి సన్‌స్క్రీన్ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వేసవిలో సన్‌స్క్రీన్ తీసుకునే ముందు అది కనీసం ఎస్‌పీఎఫ్ 30 ఉండేలా చూసుకోవాలి.
ఆహారం: వేసవి ఎండ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టాల్సిందే. కాలం ఏదైనా.. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. కాగా వాతావరణ పరిస్థితులను బట్టి మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వేసవి వేడిలో చర్మం పొడిబారకుండా ఉండటానికి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఫలాలు తినాలి. ముఖ్యంగా మామిడి, బెర్రీస్, పుచ్చకాయ లాంటి పండ్లు తినాలి. అవి మన చర్మానికి కావాల్సిన తేమను అందిస్తాయి.
హైడ్రేషన్: ఎన్ని ఏమి చేసినా.. వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి. జ్యూస్ లు వంటివి తాగాలి. అవి లేకుంటే నీళ్లయినా రోజుకు కనీసం 6-8 లీటర్లు తాగాలి. ఇంకా మంచి ఆరోగ్య కోసం కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మ జాతి పండ్ల రసం తాగడం ఉత్తమమని నిపుణులు చెప్తున్నారు.
Skincare Tips | వీటితో పాటుగా బయటకు వెళ్లే సమయంలో మరికొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం అధికంగా ఉంటుంది. కాబట్టి వడదెబ్బ తగలకుండా ఉండేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం మిట్ట మధ్యాహ్నం సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్లకూడదు. ఒకవేళ వెళ్తున్నా గొడుగు వాడటం, ముఖాన్ని కవర్ చేసే స్కార్ఫ్, కర్చీఫ్ వంటివి వినియోగించాలి. కళ్ల కోసం కూలింగ్ గ్లాసెస్‌ను వినియోగించాలి. ఇలాంటి చిట్కాలు పాటించడం ద్వారా వేసవిలో చర్మ ఆరోగ్యాన్ని, సౌందర్యాన్న కాపాడుకోవచ్చని నిపుణులు వివరిస్తున్నారు.