మార్నింగ్ బ్రేక్‌ ఫాస్ట్‌ మానేస్తున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

0
96

ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా మంచిది. కానీ ఎక్కువ మంది అల్పాహారం తీసుకోకపోగా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇంకొంత మంది బిజీ షెడ్యూల్ తో తినడమే మానేస్తున్నారు. మరి బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల ఏం జరుగుతుంది. బ్రేక్ ఫాస్ట్ అనంతరం చేయకూడని పనులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉదయం పూట తీసుకోవల్సిన బ్రేక్‌ ఫాస్ట్‌ను మానేస్తే అధిక రక్తపోటు, షుగర్‌, ఇతర గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఉదయం నిద్రలేచిన రెండు గంటల్లోపు అల్పాహారం తీసుకోవాలి. అంటే ఉదయం 9 గంటలకు ముందే బ్రేక్‌ ఫాస్ట్‌ తీసుకోవాలి.

బ్రేక్‌ ఫాస్ట్‌ (అల్పాహారం)లో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి.

పాలు, విత్తనాలు వంటి చేర్చుకుంటే మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది.

చేయకూడని పనులు:

బ్రేక్‌ ఫాస్ట్‌ చేసిన వెంటనే స్నానం చేయకూడదు.

ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది.

తిన్న వెంటనే స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.