అన్నం మానేసి చపాతీ తింటున్నారా? అయితే ఈ విష‌యాలు తెలుసుకోండి..

0
131

ప్రస్తుతం జీవనవిధానం మారింది. ఒకప్పుడు గటక, రాగి జావ వంటి పదార్ధాలు తీసుకునే వారు. ఆ తరువాత అన్నానికె ప్రాధాన్యత ఎక్కువ. అయితే రోజురోజుకు అన్నం తినే వారి సంఖ్య తగ్గింది.  అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు.

రాత్రిపూట అన్నం తిన‌డం మానేసి ఆ స్థానంలో చ‌పాతీలు తిన‌డం అలవాటు చేసుకుంటున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో వైద్యులు కూడా చ‌పాతీ తిన‌మ‌ని సూచిస్తున్నారు. దీంతో రాత్రి భోజ‌నంలో చ‌పాతీ వ‌చ్చి చేరింది. చ‌పాతీల‌ను గోధుమ‌పిండితో త‌యారు చేస్తారు. గోధుమ పిండిలో విట‌మిన్ బి, విట‌మిన్ ఇ ల‌తోపాటు కాల్షియం, ఐర‌న్, జింక్, సోడియం, పొటాషియం, మెగ్నిషియం వంటి మిన‌ర‌ల్స్ కూడా ఉంటాయి.

ఇవే కాకుండా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఇత‌ర ముఖ్య‌మైన పోష‌కాలు కూడా గోధుమ పిండిలో ఉంటాయి. అన్నం తిన‌డం వ‌ల్ల ఎంత శ‌క్తి వ‌స్తుందో అంతే శ‌క్తి చ‌పాతీల‌ను తిన‌డం వ‌ల్ల కూడా వ‌స్తుంది. రాత్రిపూట అన్నానికి బ‌దులుగా చ‌పాతీల‌నే ఎందుకు తినాలి.. అనే సందేహం కూడా చాలా మందికి వ‌స్తుంది.