తక్కువగా నిద్రపోతున్నారా? అధ్యయనాల్లో సంచలన విషయాలు..

Sleeping less? Sensational topics in studies ..

0
91
Shot of an attractive young woman asleep in her bedhttp://195.154.178.81/DATA/i_collage/pi/shoots/783514.jpg

ప్రస్తుతం ఆధునిక కాలంలో చాలా మంది జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఆలస్యంగా తినడం.. సరైన నిద్ర లేకపోవడం జరుగుతుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్ ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా సరైన సమయానికి నిద్ర పోవడం లేదు..దీంతో కేవలం రోజులో తక్కువ గంటలు నిద్రపోతున్నారు. దీంతో అనారోగ్య సమస్యల భారిన పడుతున్నారు. తక్కువగా నిద్రపోయేవారికి కొన్ని అధ్యయనాలు షాకింగ్ నిజాలు బయటపెట్టాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా ఒక వ్యక్తికి 7 నుంచి 8 గంటలు నిద్ర తప్పనిసరిగా ఉండాలి. కానీ ప్రస్తుతం చాలా మంది కేవలం నాలుగు, ఐదు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. దీంతో రోజంతా చికాకుగా ఉండడం.. విపరీతంగా కోపం రావడం జరుగుతుంది. అంతేకాకుండా.. నిద్రలేమి సమస్య మానసిక పరిస్థితి పై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని ఇటీవల ఓ అధ్యాయనంలో తేలింది. నిద్రలేమి సమస్య ఉన్నవారిలో మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయని..అలాగే అనారోగ్యం భారిన పడుతున్నట్లుగా అధ్యయనంలో తెలీంది. మానవ జీవ సమీక్షలో ఇటీవల జరిగిన ఓ అధ్యాయనం ప్రకారం సరైన నిద్ర లేకపోవడం వలన డిప్రెషన్‏కు గురయ్యే ప్రమాదం దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉందని వెల్లడైంది.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం..ఈ అధ్యయనంలో 55 శాతం మంది విద్యార్థులు ఈడీఎస్ సమస్యతో బాధపడుతున్నారని తేలింది. అంతేకాకుండా పగలు ఎక్కువగా నిద్రపోతున్నారట. దీంతో వారు దాదాపు రెండు రెట్లు ఒత్తిడిని అనుభవిస్తున్నారట. అలాగే స్త్రీలు కూడా ఎక్కువగా నిద్రలేమి, ఈడీఎస్ సమస్యలతో బాధపడుతున్నారని తేలింది. దీంతో వారి మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ మాటో గ్రాస్సో బ్రెజిల్‌లోని పోషకాహార ఫ్యాకల్టీ హెడ్ డాక్టర్ పాలో రోడ్రిగ్స్ మాట్లాడుతూ నిద్రలేమి సమస్య విద్యా్ర్థులకు ప్రమాదకరం.

ఇక 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు గల 1,113 గ్రాడ్యుయేట్.. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులపై జరిపిన అధ్యయనంలో వారి నిద్ర సమయం..ఈడీఎస్, మానసిక పరిస్థితి.. బాడీ మాస్ ఇండెస్క్ గురించి తెలుసుకున్నారు. దీని ఆధారంగా సరైన నిద్రలేని వారిలో మానసిక ఒత్తిడి.. డిప్రెషన్, మర్చిపోవడం, ఏది సరిగ్గా గుర్తుంచుకోకపోవడం అంతా గందరగోళంగా ఉండడం..కోపం ఎక్కువగా రావడం గమనించారు.