నిద్ర ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఇది మనల్ని రోజంతా శరీరాన్ని చురుకుగా ఉంచడానికి దోహదపడుతుంది. అలాగే అనారోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది.అయితే ఇలా అవసరానికి మించి అతిగా నిద్రపోవడం కూడా చాలా ప్రమాదకరం అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
రోజుకు 6 నుంచి 7 గంటల వరకు నిద్ర మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. అయితే దాని కంటే తక్కువ సమయం నిద్రించినా.. లేదా అతిగా నిద్రపోయినా, శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రోజుకు ఒక వ్యక్తి 7 గంటలు నిద్రపోతే చాలు ఇంతకంటే ఎక్కువసేపు పడుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను తెచ్చుకోవడమే .అతిగా నిద్రించడం వల్ల భవిష్యత్ లో కలిగే ప్రమాదాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్ర పోతున్న సమయంలో శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. మన శరీరంలో ఉత్పత్తి అయ్యే సెరటోనిన్ హార్మోను మన నిద్ర మెళుకువ అయ్యే విధానాన్ని నియంత్రిస్తుంది.రోజు మొత్తం బద్ధకంగా ఉండేలా చేస్తుంది డిప్రెషన్ లక్షణాలు కూడా వస్తాయి ఇలా మానసిక సమస్యలకు గురవుతారు అంతే కాకుండా దీని వల్ల డయాబెటిస్ అధిక బరువు సమస్యలు ఏర్పడతాయి.
ఒక పరిశోధన ప్రకారం ఎక్కువసేపు పడుకునే వ్యక్తులు గుండె పోటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతి రోజు నుంచి 8 గంటలు నిద్ర పోయే వారికంటే ఎక్కువ గంటలు నిద్రపోయే వారికి అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో తెలిసింది. ఏది ఏమైనా నిద్ర లేమితనంతో పాటుగా అతి నిద్రా కూడ అనారోగ్యానికి మూలంగా నిలుస్తుంది. కాబట్టి ఎవ్వరు అధికంగా నిద్రపోకండి. అనవసరమైన ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోకండి.