దిండు కింద ఫోన్ పెట్టుకొని నిద్ర పోతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

0
109

మొబైల్ ఫోన్ కి రాత్రిపూట దూరంగా ఉండటం మంచిది.మనలో చాలా మంది నిద్రపోయే ముందు సెల్ ఫోన్ ని దిండు కింద పెట్టుకొని నిద్ర పోతూ ఉంటారు.అలా నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో హానికరం.ఇంకా అలా తలకింద సెల్ ఫోన్ ని పెట్టుకుని నిద్రపోతే చాలా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మీ ఛాతి మీద కానీ దిండు కింద కానీ సెల్ ఫోన్ ని పెడితే మనం ఊహించలేని ప్రమాదాలు జరగవచ్చు.

ఇది బ్రెయిన్ పై నెగటివ్ ఎఫెక్ట్ పడేట్టు చేస్తుంది.దానివల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. అయితే ఈ విధంగా తలకింద ఫోన్ పెట్టుకుని నిద్ర పోయే వాళ్ళకి ఇటువంటి సమస్యలు తప్పవు. మరి ఎలాంటి  సమస్యలో ఇప్పుడు చూద్దాం.

ఒత్తిడిపెరుగుట:

మొబైల్ ఫోన్ కి రాత్రిపూట దూరంగా ఉండటం మంచిది. లేదు అంటే ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర పోయినప్పుడు కూడా ఒత్తిడి కలుగుతుంది.

క్యాన్సర్, ట్యూమర్స్ సమస్య:

తలకింద సెల్ ఫోన్ ని పెట్టుకొని నిద్ర పోవడం వల్ల క్యాన్సర్ మరియు ట్యూమర్స్ సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అలవాటు ఉన్న వాళ్ళు మానుకోవడం మంచిది.

డయాబెటిస్ సమస్యలు:

నిద్ర పోయేటప్పుడు ఫోన్ ని తల కింద పెట్టుకోవడం వల్ల డయాబెటిస్ మరియు హృదయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అలవాటును మానుకోండి లేదంటే ఈ సమస్యలు తప్పవు.

డిప్రెషన్:

రేడియేషన్ వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. దానితో డిప్రెషన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

నిద్రలేమి సమస్య:

రాత్రిపూట మెలటోనిన్ అనే ఒక హార్మోన్ విడుదల అవుతుంది. ఇది మనం నిద్ర పోయేటప్పుడు చేస్తుంది. కానీ ఒకవేళ కనుక తలకింద ఫోన్ ని పెట్టుకుంటే రేడియేషన్ పెరుగుతుంది. దీంతో ఆ హార్మోన్ ఉత్పత్తి అవ్వదు. ఈ కారణంగా నిద్రలేమి సమస్య వస్తుంది.

.