స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు : ప్రతి జిల్లాలోనూ పెరుగుదల, లిస్టు ఇదే

Slightly increased corona cases in Telangana

0
95

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగినట్లు బులిటెన్ లో వెల్లడైంది. సోమవారం నాడు 1511 కేసులు నమోదు కాగా మంగళవారం 1556 కేసులు నమోదయ్యాయి. అయితే తెలంగాణలో ఆదివారం ప్రభుత్వం వెలువరించిన బులిటెన్ లో మొత్తం నమోదైన కేసులు 1280 మాత్రమే. కానీ గడిచిన రెండు రోజులుగా ఆ సంఖ్య పెరుగుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. మరణాల సంఖ్యలో పెద్దగా తేడా లేదు. జిల్లాల వారీగా చూస్తే జిహెచ్ఎంసి, ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ లలో త్రిబుల్ డిజిట్ కేసులు నమోదు కాగా మిగతా జిల్లాల్లో కేసుల సంఖ్య ఆదివారంతో పోలిస్తే పెరిగింది. ఇక సింగిల్ డిజిట్ కేసులు వచ్చిన జిల్లాలు రెండు మాత్రమే. కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో సింగిల్ డిజిట్ నమోదయ్యాయి. మిగతా జిల్లాలన్నీ డబుల్ డిజిట్ తో ఉన్నాయి. మంగళవారం నాడు జారీ అయిన బులిటెన్ లో జిల్లాల వారీగా కేసుల వివరాల జాబితా కింద ఉంది చూడొచ్చు.
ఆదిలాబాద్ 8 కేసులు
కొత్తగూడెం 114
జిహెచ్ఎంసి 182
జగిత్యాల 26
జనగామ 21
జయశంకర్ భూపాలపల్లి 24
జోగులాంబ గద్వాల 19
కామారెడ్డి 8
కరీంనగర్ 88
ఖమ్మం 131
కొమరం భీం ఆసిఫాబాద్ 9
మహబూబ్ నగర్ 28
మహబూబాబాద్ 54
మంచిర్యాల 38
మెదక్ 15
మేడ్చల్ మల్కాజ్ గిరి 91
ములుగు 29
నాగర్ కర్నూల్ 20
నల్లగొండ 135
నారాయణపేట 16
నిర్మల్ 3
నిజామాబాద్ 18
పెద్లపల్లి 70
రాజన్న సిరిసిల్ల 35
రంగారెడ్డి 90
సంగారెడ్డి 21
సిద్దిపేట 33
సూర్యాపేట 77
వికారాబాద్ 22
వనపర్తి 125
వరంగల్ రూరల్ 21
వరంగల్ అర్బన్ 52
యాదాద్రి భువనగిరి 33

రాష్ట్ర వ్యాప్త సమాచారం :
తెలంగాణలో కరోనా కేసులకు సంబంధించిన మంగళవారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ కేసులు 1556 నమోదయ్యాయి. ఆదివారం 1300 దిగువన ఉన్న కేసులు ఇవాళ 1556 నమోదయ్యాయి. మరణాల సంఖ్య 14 నమోదైంది. ఇవాళ పరీక్షలు 1,20,043 జరిపారు. కోవిడ్ సోకి కోలుకున్న వారి సంఖ్య 2070 గా ఉంది.
ఈరోజు కోలుకున్న వారి సంఖ్య 2070
ఈరోజు మృతుల సంఖ్య 14
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 11933
ఇవాళ చేసిన కోవిడ్ టెస్టుల సంఖ్య 1,20,043
పెండింగ్ లో ఉన్న రిపోర్టుల సంఖ్య 1013