రాగిపాత్రలో నీళ్లు తాగడం వల్ల ఇన్ని సమస్యలా..!

0
128

రాగి పాత్రలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికి తెలుసు. అంతేకాకుండా అనేక వ్యాధులను దూరం చేయగల శక్తి రాగిపాత్రల్లో ఉండే నీటికి ఉంటుందని మన పెద్దలు చెప్తుంటే వింటుంటాము. కానీ రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తుంటారు. మనం తెలియక చేసే ఈ చిన్నచిన్న తప్పుల వల్ల కూడా సమస్యలు వస్తాయట..

అవేంటంటే..భోజనం చేసిన తర్వాత రాగి పాత్రలో ఉంచిన నీటిని ఎప్పుడూ తాగకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల జీర్ణక్రియపై చెడు ప్రభావం పడి జీర్ణక్రియ మందగించడం, కడుపు నొప్పి సమస్యలు తలెత్తుతాయి. రాత్రి నిద్రపోయే సమయంలోనూ కూడా రాగి పాత్రలో నీరు తాగకూడదు.

ఒకవేళ ఆరోగ్యపరంగా మంచి లాభాలు పొందాలంటే రాగి పాత్రలో రాత్రి నీటిని పోసి 12 నుండి 48 గంటల పాటు నిల్వ చేసి, ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. రాగి పాత్రలో ఉంచిన నీటిని పరిమిత పరిమాణంలో తాగాలి. 2 లీటర్ల కంటే ఎక్కువ తాగితే కడుపు నొప్పి, గ్యాస్ లేదా అసిడిటీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.