గాడిద పాలతో సోప్స్ అతని లైఫ్ మారిపోయింది -భలే స్టోరీ

Soaps with donkey milk changed his life

0
100

గేదె పాలు, మేక పాలు, ఆవు పాలు ఇలా ఈ పాలకు ఎంత డిమాండ్ ఉంటుందో తెలిసిందే. ఇక ఇప్పుడు గాడిద పాలకు కూడా డిమాండ్ బాగా పెరిగింది. అయితే ఈ గాడిద పాలతో సబ్బులు తయారు చేస్తున్నారు. ఈ ఐడియా గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. గాడిద పాలతో సబ్బు ఈ ఐడియా జోర్డాన్ లో ఉండే ఎమాద్ అట్టియట్ అనే వ్యక్తి జీవితాన్ని మార్చేసింది.

చదువు తర్వాత ఉద్యోగం రాకపోతే ఏదో ఓ కొత్త ఐడియాతో మార్కెట్ లో వ్యాపారం చేయాలి. ఇక్కడ ఎమాద్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో పీజీ చేసారు. తన చదువుకు తగిన ఉద్యోగం దొరక్క ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడు. చివరకు తల్లి సహకారంతో వ్యాపారం ప్రారంభించాడు. అయితే అందరూ చేసేది చేస్తే పెద్ద ప్రయోజనం ఉండదు అందుకే గాడిద పాలతో సబ్బులు చేయాలని అనుకున్నాడు.

ముందు అందరికి ఈ విషయం చెబితే నవ్వుకోవడం, నెగిటివ్ గా విమర్శలు చేయడమే చేశారు. అయితే తన ఐడియాని ముందుకు తీసుకువెళ్లాడు. డాంకీ మిల్క్ సోప్స్ అనే పేరుతో ఓ కంపెనీని స్టార్ట్ చేశాడు. తను 10 గాడిదలని పెంచుతూ ఆ పాలు తీస్తూ ఈ సోప్స్ తయారు చేస్తున్నాడు . ఈ గాడిద పాలలో నూనెలు, వన మూలికలు వేసి సబ్బులు తయారు చేస్తున్నారు. ఇక ఓ లీటర్ గాడిద‌ పాలకు 28 నుంచి 30 సబ్బులు తయారు చేస్తున్నారట. సబ్బు ధర 11 డాలర్లు అంటే 807 రూపాయలు మన కరెన్సీలో దీని కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. స్టాక్ మాత్రం ఎక్కడా దొరకడం లేదట.