Sprouts Benefits | అధిక బరువు.. ఇప్పుడు అత్యధిక మందికి అతి పెద్ద సవాల్‌గా ఉంది. అతి పిన్న వయసులోనే అధిక బరువుతో బాధపడుతున్న వారు ఎందరినో మన చూస్తూనే ఉంటాం. ఆ అధిక బరువును తగ్గించుకోవడానికి అందరూ అనేక మార్గాలు వెతుకుతుంటారు. మరికొందరు జిమ్, యోగా, వ్యాయామాలు, ప్రత్యేక ట్రీట్‌మెంట్‌లు తీసుకుంటున్నారు. అయితే బరువు తగ్గాలంటే ముందుగా మన మన ఆహారంపై దృష్టి పెట్టాలని ప్రతి ఒక్కరూ చెప్తారు. కానీ ఏం తినాలి.. ఎలా తినాలి అన్నది మాత్రం చాలా మంది చెప్పారు.ఇలాంటి డైలమాలో ఉన్న వారికి బరువు తగ్గడానికి ఎంతగానో దోహదపడే ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ దీనిని తింటే ఇది బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయని నేను కాదు.. ఆరోగ్య నిపుణులు కూడా చెప్తున్నారు.
ఈ ఆహారం తయారీ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. అదే మొలకెత్తిన విత్తనాలు. అవును.. ప్రతి రోజూ మొలకెత్తిన విత్తనాలు తినడంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు బరువు తగ్గడంలో ఇవి ప్రధానంగా పనిచేస్తాయని నిపుణులు కూడా చెప్తున్నారు. మొలకెత్తిన విత్తనాలు తింటే చాలా త్వరగా బరువు తగ్గొచ్చు. ప్రతి రోజూ ఒక కప్పు మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ప్రతి రోజూ ఉదయంపూట ఒక కప్పు మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల ఆరోజు మొత్తం తీసుకునే ఆహారం తక్కువగా ఉంటుంది. తద్వారా బరువు తగ్గడం వేగవంతం అవుతుంది.
Sprouts Benefits | అంతేకాకుండా మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. ఇతర ఆహారాలతో పోలిస్తే మొలకెత్తిన విత్తనాలు మనకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. అవయవాలకు రక్తం, ఆక్సిజన్ వంటికి సరిపడా అందేలా ఈ ఆహారం చేస్తుంది. ఈ మొలకల్లో విత్తనాల్లో ఉండే అధిక ఫైబర్ మన రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గిస్తుంది. వీటిలో ఉండే డైటరీ ఫైబర్ మన జీర్ణప్రక్రియను వేగవంతం చేస్తాయి. మలబద్దకం వంటి సమస్యలకు వీటి ద్వారా చెక్ పెట్టొచ్చు. వీటిని ప్రతి రోజూ తినడం వల్ల హార్మోన్ అసమతుల్యత వంటివి కూడా రావని నిపుణులు వివరిస్తున్నారు.