ప్లాస్టిక్ టీ కప్స్ లో టీ తాగుతున్నారా? అయితే ఇది మీరు చదవాల్సిందే

ముందు ఓ విషయం గుర్తు ఉంచుకోవాలి

0
251

ఈ మధ్య ప్లాస్టిక్ కప్స్ ,కవర్లు, ప్లేట్స్ వాడకం బాగా పెరిగిపోయింది. ఇక ఏదైనా షాపుకి వెళితే సరుకులకి కవర్ అడుతున్నారు. టీ తాగితే ప్లాస్టిక్ గ్లాస్ వాడుతున్నారు. ఇలా అనేక రకాల వస్తువులు వాడుతున్నారు. ఇవన్నీ కూడా పర్యావరణానికి ఎంతో చేటు చేస్తున్నాయి. మన శరీరానికి కూడా చేటు చేస్తున్నాయి. ప్రతీ రోజు ఇలాంటి వాటిలో టీ, డ్రింకులు, వాటర్ తాగితే అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ముందు ఓ విషయం గుర్తు ఉంచుకోవాలి. ఇందులో వేడి పదార్దాలు తాగితే త్రోట్ క్యాన్సర్ , ఎసిడిఫికేషన్, అల్సర్ వంటి కడుపు సంబంధిత సమస్యలు వేధిస్తాయి. ఇలా మీరు ఈ ప్లాస్టిక్ గ్లాసులో టీ తాగితే మీ శరీరంలోకి సూక్ష్మమైన 75,000 టైనీ ప్లాస్టిక్ పార్టికల్స్ చేరినట్టే. అందుకే ఇలా వేడి వేడి పదార్దాలు మీరు ఆహారంగా తీసుకున్నా ఇబ్బంది అని తెలియచేస్తున్నారు నిపుణులు.

మైక్రోప్లాస్టిక్స్ తీసుకోవడం ద్వారా మీ రోగనిరోధక శక్తి చాలా వరకూ తగ్గుతుంది.మరో విషయం అసలు ఇలాంటి వస్తువులు గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు. ఈ కప్పులపై ఎక్కువగా సూక్ష్మక్రిములు తిష్టవేసి ఉంటాయి. అందుకే జ్యూస్ ఇలాంటివి గాజు గ్లాసులో తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు. లేదా స్టీల్ గ్లాసులు టీ కప్స్ ఇలాంటివి వాడండి.