కిడ్నీలో రాళ్లు సమస్య చాలా మందికి ఉంటుంది. తీవ్రమైన నొప్పి కూడా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్యతో ఎంతో మంది బాధపడుతున్నారు. కిడ్నీ స్టోన్స్ ఉంటే కొన్ని లక్షణాలు బయటపడతాయి. పొత్తికడుపులో నిరంతర నొప్పి, మూత్ర విసర్జన చేసేటప్పుడు కొద్దిగా నొప్పి, తరచూ మూత్రానికి వెళతారు. వికారం,బలహీనత, మైకం, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి.
అయితే వైద్యులు ఈ సమస్య ఉంటే కొన్ని ఆహారాలు తీసుకోవద్దు అంటున్నారు. అతిగా ఉప్పు తీసుకోవడం మానేయ్యాలి. చాలా వరకూ అతిగా ఉప్పు తింటే సమస్య వస్తుంది. జంక్ ఫుడ్ తినడం మానేయాలి, చాలా మంది ఈ జంక్ ఫుడ్ చిప్స్ ఇలాంటి ఆహారాల జోలికి వెళ్లవద్దు అంటున్నారు.
మాంసం తీసుకోవడం తగ్గించాలి. నాన్ వెజ్ లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇలా మీరు ఎక్కువ ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటే కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది. ఇక ఇలాంటి సమస్య ఉన్న వారు చాక్లెట్ కి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఆక్సలేట్ ఉంటుంది దీనివల్ల కిడ్నీ స్టోన్స్ పెరుగుతాయి. పాలకూర, తృణధాన్యాలు, చాక్లెట్, టమోటాలకి కూడా దూరంగా ఉండాలి.