ఈ ఫుడ్ కి దూరంగా ఉండండి లేదంటే ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తాయి

Stay away from this food otherwise you will get fatty liver problems

0
133

కొంత మంది ఎక్కువగా బయట చిరుతిళ్లు తింటూ ఉంటారు. మరికొందరు రోడ్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు. మరికొందరు ఆయిల్ ఫుడ్ అతిగా తీసుకుంటారు. ఇంకొందరు ఫాస్ట్ పుడ్ కు ఎడిక్ట్ అవుతారు . ఇలాంటి ఫుడ్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు నిపుణులు. ఇలాంటి ఫుడ్ వల్ల కాలేయానికి చాలా హానికరం అని చెబుతున్నారు.

మరి ఏవి తినకూడదు అనేది ఓసారి చూద్దాం.
ఎక్కువగా స్వీట్లు తీసుకోవద్దు అలాగే చాక్లెట్లు, డ్రింకులు, చక్కెర ఎక్కువగా ఉండే అన్ని పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. ఇవి ఎక్కువగా తినడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది.

అలాగే ఆయిల్ ఫుడ్ సమోసాలు, పకోడీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, స్ప్రింగ్ రోల్స్ వీటికి దూరంగా ఉండాలి
ఉప్పులో సోడియం ఉంటుంది అందుకే ఇది కూడా అతిగా తీసుకోవద్దు. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల కాలేయ వాపుకు దారితీస్తుంది. అందుకే లివర్ సమస్య ఉంటే ఉప్పు చాలా తక్కువ తీసుకోమంటారు.
బ్రెడ్, పాస్తా, బిస్కెట్లకి దూరంగా ఉండటం మంచిది. చివరగా మద్యం దీనికి దూరంగా ఉండాలి.