ఇంట్లోనే ఈజీగా మీ జుట్టును స్ట్రెయిట్ చేసుకోండిలా..!

0
76

ప్రస్తుతకాలంలో చాలామందికి వెంట్రుకలను స్ట్రెయిట్ చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపొయింది. కానీ వెంట్రుకలను స్ట్రెయిట్ చేసుకోవడానికి  డబ్బు ఖర్చు కావడంతో పాటు..రసాయన చికిత్సల కారణంగా అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే హెయిర్ స్ట్రెయిటెనింగ్ ఇంట్లోనే సహజంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

మొదటి చిట్కా: నేచురల్ హెయిర్ స్ట్రెయిటెనింగ్ కోసం నిమ్మరసం మరియు కొబ్బరి పాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈ రెండూ కలిపి ఒక పేస్ట్ లా తయారు చేసుకొని ఈ పేస్ట్‌ని మీ జుట్టుకు పట్టించి గంటసేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో జుట్టును కడగాలి. మీరు మొదటిసారి మీ జుట్టును దువ్వినప్పటి నుండి మీ జుట్టులో మంచి మార్పు మరియు వ్యత్యాసాన్ని చూడవచ్చు.

రెండో చిట్కా: 2 చెంచాల కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ నూనె తీసుకుని డబుల్ బాయిలర్‌లో వేడి చేయాలి. ఈ గోరువెచ్చని నూనెను తలకు బాగా పట్టించి మసాజ్ చేయండి. ఇది జుట్టు మూలాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. ఇంకా  గిరజాల లేదా ఉంగరాల జుట్టును నిఠారుగా చేయడంలో కూడా ఉపయోగపడుతుంది.