Alert: కెనడాలో వింత వ్యాధి కలకలం..

0
83

అంతుచిక్కని ఓ వింత వ్యాధి కెనడాలో కలకలం సృష్టిస్తోంది. బ్రన్‌స్విక్‌ ప్రావిన్స్‌లో వెలుగుచూసిన ఈ సంఘటనలో ఇప్పటికే ఈ వ్యాధితో ఆరుగురు మరణించారు. కారణం తెలియని బ్రెయిన్‌ డిసీజ్‌తో పదుల సంఖ్యలో ప్రజలు ఆనారోగ్యబారీన పడుతున్నారు. అక్కడి ప్రాంతీయ మీడియా కథనాల ప్రకారం 48 మంది ఇప్పటికే ఈ వ్యాధి బారీన పడ్డట్టు సమాచారం.

వీరంతా మతిమరుపు, తికమకపడటం వంటి వ్యాధి తాలూకు లక్షణాలతో హాస్పిటల్లలో చేరుతున్నారని తెలిసింది. ఈ గుర్తు తెలియని వ్యాధికి గల కారణాలు డాక్టర్లకు కూడా అంతుచిక్కడం లేదు. తాజా నివేదికల ప్రకారం మరణించిన వారందరూ 18 నుంచి 85 యేళ్ల మధ్య వయసు వారు కావడంతో ఆ భయం రెట్టింపు అయింది.

ఇప్పటికే కరోనా సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. ఆ భయం నుండి ఇంకా తేరుకోకముందే ఈ వింత వ్యాధి కలకలం రేపుతోంది. ఇప్పటికే రకరకాల వ్యాధులతో విసిగివేసారిపోయిన ప్రజలు..ఎటునుంచి ఏ కొత్త వైరస్‌ రూపంలో ఏ వ్యాధి వ్యాపిస్తుందో తెలియక ప్రాణాలు గుప్పెట్టో పెట్టుకుని క్షణక్షణ గండంగా బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో మెదడుకు సంబంధించిన ఈ కొత్త వ్యాధి ప్రజల్లో భయందోళనలు రేకెత్తిస్తోంది.