ఇలాంటి వ్యక్తులు పెరుగు తీసుకుంటే ప్రాణానికే ప్రమాదమట..!

0
116

పెరుగు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని అందరికి తెలుసు. నిజానికి పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. మంచి బ్యాక్టీరియాలను వృద్ధి చేసే ప్రోబయోటిక్స్ కూడా ఇందులో ఉంటాయి. కానీ మనందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఇది కొంతమంది తింటే నష్టం చేకూరే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వీళ్లు పెరుగుతింటే…అది విషంతో సమానమట. ఇంతకీ వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.

పెరుగు తినడం ద్వారా మీ శరీరానికి కావల్సినంత కాల్షియం లభిస్తుంది. దానివల్ల మీ ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. కానీ  ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు. పెరుగు అస్సలు తినకూడదు. ఒకవేళ తినట్లయితే సమస్య అధికం అవుతుంది.

ఆస్తమా లేదా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే పెరుగుకు పూర్తిగా దూరంగా ఉండడం మంచిది. లాక్టోస్ ఇన్‌టాలరెన్స్ తో బాధపడే వాళ్ళు కూడా పెరుగును తినవద్దు. కడుపు నొప్పి సమస్య వచ్చే ప్రమాదం ఉంది. అసిడిటీ సమస్య ఉన్నట్లయితే పెరుగు అస్సలు తినకూడదు.

ఈ జాబితాలో ఉన్న రోగులు కేవలం పెరుగుకే కాదు..పాల ఉత్పత్తులకు కూడా కాస్త దూరంగా ఉండటం మంచిది.పెరుగును మాత్రం తీసుకోకపోవటం మంచిదంటున్నారు వైద్యులు. కాదని తీసుకుంటే మీ ఆరోగ్యాన్ని మీరే నిర్లక్ష్యం చేసినవారవుతారు.