గురక సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి..

0
99

ప్రస్తుత కాలంలో గురక సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కేవలం వారే కాకుండా తమ పక్కన పడుకున్న వారికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యను తగ్గించే ప‌రిక‌రాలు వాడినప్పటికీ పెద్దగా ఫలితాలు లభించవు. అందుకే ఈ గురక సమస్య నుండి శాశ్వతంగా ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటించి..మంచి నిద్రను సొంతం చేసుకోండి.

ఈ సమస్యకు గల ముఖ్య కారణం ఏంటంటే..నాలుక‌, గొంతు కండ‌రాలు వ‌దులు అవ్వ‌డం వల్ల గురక వస్తుంది. గురక పెట్టడం వల్ల వ‌ల్ల నిద్రలేమి, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు కూడా ఎదుర్కోవలసి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా బ‌రువు ఉండడం వల్ల కూడా గుర‌క రావ‌డానికి కారణమని పెద్దలు చెబుతున్నారు. అధిక బ‌రువు వ‌ల్ల శ్వాస మార్గంలో అవ‌రోధాలు కలిగి ఈ సమస్య వస్తుంది.

ప‌డుకునేట‌ప్పుడు త‌ల భాగం ఎత్తులో ఉండేలా జాగ్రత్త పడాలి. గొంతు, నాలుకకు సంబంధించిన వ్యాయామాలు చేయ‌డం వ‌ల్ల కండ‌రాలు గ‌ట్టి ప‌డి గుర‌క రావ‌డం మెల్లగా తగ్గుతుంది. ధూమ‌పానం, మ‌ధ్య‌పానం చేయ‌డం వ‌ల్ల కూడా గుర‌క వ‌స్తుంది. కావున ఇలాంటి అలవాట్లు వెంటనే మానుకోవడం మంచిది. అంతేకాకుండా మనం ఉండే శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కూడా సమస్య తొలగిపోతుంది.