ముఖంపై మొటిమలతో బాధపడుతున్నారా? అయితే నైట్ పడుకునే ముందు ఇలా చేయండి..

0
119

ప్రస్తుతం ఎక్కువ మంది మహిళలను మొటిమల సమస్య వేధిస్తుంది. మొఖం మీద మొటిమలతో నలుగురిలో కలిసి తిరగడానికి మొహమాటం పడుతుంటారు. అయితే మొటిమలను తగ్గించుకోడానికి అనేక రకాల క్రీములు వాడుతుంటారు. కానీ ఇవి సమస్యను మరింత ఎక్కువ చేస్తాయి. మరి మొటిమల నివారణకు ఏం చేయాలి? ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం..

మస్టర్డ్ నూనెను రాత్రి పడుకునే ముందు రాసుకోవాలి. దీనిలో యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖంపై వుండే హానికరమైన బాక్టీరియాను తొలగిస్తుంది. దీనితో యవ్వనంగా కనిపిస్తారు. అలాగే చర్మ గాయాలను నుండి ఆవాల నూనె తగ్గిస్తుంది.

ముఖంపై మొటిమలను కాకుండా టానింగ్, మచ్చలు, గుర్తులు తొలగిపోతాయి. అలాగే చర్మంపై ఉన్న రంధ్రాలు, ముడతలు తొలగిపోతాయి. మస్టర్డ్ ఆయిల్ వల్ల మొఖం మెరుస్తుంది. అలాగే ఇది మొఖంపై సహజమైన మెరుపును, అందాన్ని కలిగించడంలో తోడ్పడుతుంది. అంతేకాదు ఇది పొడిచర్మం సమస్యను తగ్గిస్తుంది.