మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి

0
89

మనలో చాలా మంది మొటిమల సమస్యలతో బాధపడుతున్నారు. ముఖం మొటిమలు ఏర్పడి.. వాటి వల్ల ఏర్పడిన మచ్చలతో అందం తగ్గుతుంది. దీని కోసం ఎన్ని మందులు, క్రీములు వాడినా.. చాలా మందిలో తగ్గవు. కానీ ఇంట్లో దొరికే పదార్థాలతోనే వీటీని ఈజీగా తొలగించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చర్మంపై వచ్చే అన్ని సమస్యలలో మొటిమలు సర్వసాధారణం. మొటిమలు పద్నాలుగు నుండి ముప్పై సంవత్సరాల మధ్య కనిపిస్తాయి. వాటిలో నొప్పి కూడా ఉంటుంది. మొటిమల వల్ల ముఖంపై మచ్చలు కూడా పడి.. అందం తగ్గుంది. మరి మొటిమలను సహజసిద్ద పద్దతుల్లో తొలగించే చిట్కాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఉల్లిపాయ రసాన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసి ముఖంపై మొటిమలు ఉన్న చోట రాసి ఆరిన తర్వాత కడిగేయాలి. ఉల్లిపాయలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఉల్లిపాయ రసాన్ని పూయడం వల్ల మొటిమలు తొలగిపోతాయి.

రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని కొబ్బరి నూనెను మొటిమల మీద రాసి ఉదయాన్నే శుభ్రమైన నీటితో కడిగేస్తే మొటిమలు తొలగిపోతాయి. కొబ్బరి నూనెలో మంచి మొత్తంలో విటమిన్-ఇ ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మచ్చలను తొలగిస్తుంది.

శనగపిండిలో పెరుగును అవసరం మేరకు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి, ఆరిపోయే వరకు అలాగే ఉంచి, శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు తొలగిపోయి..మంచి నిగారింపు వస్తుంది.

మొటిమలు పోయిన తర్వాత నల్లటి మచ్చలు ఏర్పడతాయి. వాటిపై ఆపిల్ సైడర్ వెనిగర్ వాడకం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఒక చెంచా యాపిల్ వెనిగర్‌లో రెండు చెంచాల తేనె, కొంచెం నీరు మిక్స్ చేసి దూదితో మొటిమల మీద అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే తొందర్లలోనే మచ్చలు పోతాయి.