కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి..

0
97

సాధారణంగా  60 ఏళ్ల, 70ఏళ్లు వచ్చాయంటే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి. కానీ ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు ఈ సమస్యకు గురవుతున్నారు. కేవలం కీళ్ళ నొప్పులే అని కాకుండా మోచేతులు, భుజాలు ఎలాంటి నొప్పులనుండయినా ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటించండి.

రాగులు, జొన్నలు, సజ్జలు రోజువారీ డైట్ లో చేర్చుకోవాలి. దీనివల్ల శరీరానికి కావాల్సిన కీలక పోషకాలు అంది..ఎముకలు దృఢంగా అవ్వడానికి తోడ్పడతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు రొయ్యలను తినాలి. వీటిలో ఉండే విటమిన్‌ కీళ్ల నొప్పులను పోగొట్టడానికి ఉపయోగపడతాయి. నారింజను రోజూ తింటే కీళ్ల నొప్పుల సమస్య దూరమవుతుంది. వీటిల్లో ఉండే విటమిన్‌ సి వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి.

అరటి పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అంతేకాకుండా  వీటిలో పొటాషియం సమృద్ధిగా ఉండడం వల్ల ఎముకల సాంద్రతను పెరుగుతుంది. ఉప్పు అధికంగా తినకూడదు. దానివల్ల శరీరంలో పలు భాగాల్లో ఉప్పు నిల్వ ఉండిపోయి మోకాళ్ల సమస్య అధికం అయ్యే అవకాశం ఉంది. వేడి, చల్లటి నీటిలో నానబెట్టిన వస్రాన్ని మీకు నొప్పి ఉన్న ప్రదేశంలో పెట్టడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది.