ప్రస్తుతకాలంలో ఒత్తిడి, నిద్రలేమి మరియు జుట్టుకు పోషకాలు అందక జుట్టు రాలిపోవడం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా పురుషులకు చిన్న వయసులోనే జుట్టు మొత్తం రాలి బట్టతలాగా మారడంతో అందవిహీనంగా కనిపిస్తారు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి మార్కెట్లో దొరికే వివిధ రకాల మందులతో పాటు..అంటిమెంట్స్ వాడుతుంటారు. కానీ వాటిని వాడడం వల్ల మెదడుపై ప్రభావం పడి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ సహజ చిట్కాలు పాటించి చూడండి..
అందాన్ని పెంచడంలో జుట్టు కీలకపాత్ర పోషిస్తుందనే విషయం అందరికి తెలిసిందే. కావున బట్టతల సమస్య నుండి ఉపశమనం పొందడానికి ఉల్లిపాయను ఉపయోగించడం మంచిది. ఉల్లిపాయను కోసి గ్రైండ్ చేసి రసం తీసుకుని అందులో తేనె కలిపి తలకు పట్టించి కాసేపు బాగా మసాజ్ చేయడం వల్ల ఉల్లిపాయల్లోని సల్ఫర్ తలకు రక్త ప్రసరణను పెంచి బాక్టీరియాను చంపుతుంది. దీనివల్ల జుట్టు మళ్ళి వచ్చే అవకాశం ఉంటుంది.
ఇంకా కొబ్బరినూనె కూడా ఈ సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను తలకు పట్టించి పది నిమిషాల పాటు మసాజ్ చేసి.. మరుసటి రోజు ఉదయం జుట్టును కడుక్కుంటే జుట్టు పెరగడంతో పాటు..కొత్తజుట్టు మొలుస్తుంది. బట్టతలని తొలగించడంలో సోపు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.