ప్రస్తుతం యువతను వేధిస్తున్న ప్రధాన సమస్య తలనొప్పి. అయితే ఇది రావడానికి చాలా కారణాలున్నాయి. మానసిక ఆందోళన, ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, అధిక రక్తపోటు, జలుబు వంటి వాటి వల్ల మనం ఈ తలనొప్పి బారిన పడుతూ ఉంటాం. ఈ తలనొప్పితో పనులు చేయలేక..తలనొప్పిని ఎలా తగ్గించుకోవాలో తెలియక నానా తంటాలు పడుతున్నారు.
ఈ తలనొప్పి నుండి బయట పడడానికి కొంతమంది తలనొప్పి మాత్రలను ఉపయోగిస్తారు. కొందరు టీ, కాఫీ లను తాగుతూ ఉంటారు. కొందరు తలకు ఏవేవో తైలాలను రాస్తూ ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక్కోసారి ఈ తలనొప్పి తగ్గదు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ తగ్గని ఈ తలనొప్పిని మనం కేవలం మన వంటింట్లో ఉండే దాల్చిన చెక్కను ఉపయోగించి తగ్గించుకోవచ్చు.
తలనొప్పిని తగ్గించడంలో దాల్చిన చెక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నప్పుడు దాల్చిన చెక్కను నీటితో కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని నుదుటికి, కణతలకు బాగా పట్టించాలి. తరువాత ఒక గిన్నెలో పావు లీటర్ నీటిని పోసి అందులో 4 నుండి 5 దాల్చిన చెక్క ముక్కలను వేసి బాగా మరిగించి వడకట్టాలి. ఇలా వడకట్టిన నీటిని కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఎంతటి తీవ్రమైన తలనొప్పి అయినా వెంటనే తగ్గుతుంది.