మనం చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తుంటే ఇవన్నీ మనమే చేశామా అనే అనుమానం వస్తుంది. రకరకాల ఆటలు, వివిధ రకాల పదార్ధాలను తింటూ ఉండే పాఠశాల రోజులు మళ్లీ వస్తే బాగుండు అనిపిస్తుంది. అయితే మనం అప్పుడు చేసిన పనులు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడ్డాయి అనే విషయం మనకు తెలియదు. ఆటలు మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. కానీ నేటి పిల్లలు ఆటలకు దూరమవుతున్నారు. దీనితో అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అందులో ఒకటి నోటి పూత సమస్య.
నోటిలో అక్కడక్కడా పొక్కులలాగా ఏర్పడి అవి పగిలి ఆ ప్రాంతంలో తెల్లగా మారుతుంది. అది కలిగించే నొప్పి అంతా ఇంతా కాదు. తినాలన్న, నీరు తాగాలన్న ఇవి మంటను, నొప్పిని కలిగిస్తాయి. ఇవి చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరినీ బాధిస్తాయి. పెద్ద వారి కంటే చిన్న పిల్లల్లో మనం ఈ సమస్యను ఎక్కువగా చూడవచ్చు. ఈ నోటిపూత సమస్య రావడానికి అనేక కారణాలు ఉంటాయి. మనం నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోయినా, శరీరంలో వేడి అధికంగా ఉన్నా అవి నోటిపూత సమస్యకు దారి తీస్తాయి. ఈ సమస్య నుండి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాం.
పరిష్కారం ఇలా..
ఒక జామ ఆకులో ఒక చింతపండు రెబ్బను ఉంచి బాగా నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా నోటి పూత సమస్య తగ్గుతుంది. ఈ విధంగా నేల ఉసిరి మొక్కను ఉపయోగించి మనం నోటిపూత సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.