మనము ఏదైనాపని చేసినప్పుడు చెమటలు విపరీతంగా వస్తాయి. కానీ కొంతమందికి మాత్రం అసలే చెమటలు రావు. చెమటలు పట్టడం వల్ల చిరాకు, అసంతృప్తి కలుగుతుంది. అందుకే ఈ టిప్స్ పాటించి చెమటను నుండి ఉపశమనం పొందండి. దీని వెనక ఓ కారణం కూడా ఇదే..
ఎక్కువ చెమటలు పట్టినవారు అధిక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యం మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. థైరాయిడ్, డయాబెటిస్, హైపర్ టెన్షన్, లేదా కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు కూడా ఈ అధిక చెమటకు కారణమవుతాయి. ఈ అధిక చెమట సమస్య నుండి ఉపశమనం పొందాలంటే టమోటా తినడం వల్ల తగ్గించుకోవచ్చు.
చెమట పట్టిన ప్రాంతంలో నిమ్మకాయరసాన్ని రుద్ది చల్లటి నీళ్లతో కడిగేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. అలోవెరా జెల్ లో చల్లదనాన్ని అందించే మంచి లక్షణం ఉంటుంది. అందుకే ఎక్కువగా చెమట పట్టే ప్రాంతంలో నేరుగా రాయడం వల్ల ఈ సమస్య తీరిపోతుంది. రోజు అధికంగా నీరు తాగడం వల్ల దుర్వాసన నుండి ఉపశమనం పొందవచ్చు.