తెల్లజుట్టుతో బాధపడుతున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

0
89

సాధారణంగా 40 ఏళ్లు పైబడిన తర్వాత జట్టు తెల్లగా మారడం ప్రారంభమవుతుంది. కానీ ఈ మధ్య కాలంలో 15 ఏళ్లకే జట్టు తెల్లగా మారడం పెద్ద సమస్యగా మారింది. వాస్తవానికి అందాన్ని జుట్టు చూసే పరిగణిస్తారు. జుట్టు తెల్లగా అవ్వడానికి ముఖ్య కారణం కాలుష్యం,ఒత్తిడి, ఆహారపు అలవాట్లు,ఎండ తగలేకపోవడం వల్ల ఎదురవుతాయి.ఈ టిప్స్ ఫాలో అయితే ఈ సమస్యకు వెంటనే చెక్ పెట్టొచ్చు.

కరివేపాకు: కరివేపాకులో బయో యాక్టీవ్ పదార్దాలు ఉంటాయి. అందుకే తెల్లజుట్టు సమస్యను దూరం చేస్తుంది. కరివేపాకు పేస్ట్ లేదా కరివేపాకు వేసిన నూనె తలకు రాసుకోవడం వల్ల తెల్లజుట్టు సమస్య తొలగిపోతుంది.

నిమ్మకాయ: నిమ్మకాయలో ఉండే మూలికలు జుట్టు నల్లగా మారడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.15ml నిమ్మరసం,20 గ్రాముల జామకాయ పొడిని కలిపి పేస్ట్ ల తయారు చేసుకొని.. తలకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి.