ప్రస్తుత కాలంలో ఒత్తిడి, పనిభారం కారణంగా చాలామంది తలనొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు ఈ సమస్యకు గురవుతున్నారు. మందులు వాడిన ఒక్కోసారి ఉపాశమనం కలగకపోవచ్చు. అందుకే ఈ సమస్యతో బాధపడేవారు ఇంట్లోనే ఉండి చీటికలో తలనొప్పి మాయం చేసుకోవచ్చు.
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, ఉప్పు వేసుకుని తీసుకుంటే ఉపశమనం పొందడంతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అరటిపండు పైనాపిల్ ని జ్యూస్ చేసుకొని తాగడం వల్ల కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. తలస్నానం చేసిన తర్వాత తలను పూర్తిగా ఆరబెట్టకపోవడం వల్ల కూడా ఈ సమస్య వేధిస్తుంది. సరిగా నిద్రపోకపోయినా కూడా తలనొప్పికి దారి తీస్తుంది.
కాబట్టి రోజుకు కనీసం 7-8 గంటల సమయం పాటు నిద్రపోతే అన్ని సమస్య ఇట్టే తొలగిపోతాయి. అంతేకాకుండా ఎక్కువ సమయం పాటు కంప్యూటర్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను చూడడం వల్ల కూడా ఈ తలనొప్పి సమస్య వేధిస్తుంది. అందుకే గంటకు ఒకసారి కళ్ళకు విశ్రాంతి ఇస్తూ ఉండాలి. దీని వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.