షుగర్ సమస్య ఉన్న వారు బెల్లం తెనే వాడవచ్చా వైద్యుల మాట

షుగర్ సమస్య ఉన్న వారు బెల్లం తెనే వాడవచ్చా వైద్యుల మాట

0
104

ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే మధుమేహంతో బాధ పడే వాళ్ల సంఖ్య కోట్లలో ఉంది, అయితే ఈ సమస్య ఓసారి వచ్చింది అంటే జీవితాంతం అలాగే ఉంటుంది, ముఖ్యంగా టెన్షన్ పడకూడదు, అలాగే షుగర్ సమస్య రాకుండా ఉండాలి అంటే బరువు పెరగకుండా చూసుకోవాలి, పిండి పదార్దాలు తగ్గించాలి అంటున్నారు వైద్యులు.

ఇక షుగర్ ఉంటే స్వీట్స్ తీపి పదార్దాలకు దూరంగా ఉండాల్సిందే , లేకపోతే వారికి ఎన్నో ఇబ్బందులు వస్తాయి, అయితే ఈ రోజుల్లో చాలా మంది షుగర్ కాదు అని బెల్లం, తాటిబెల్లం తేనే తీసుకుంటున్నారు, దీని వల్ల మంచిదే అని కొందరు అనుకుంటున్నారు, కాని వైద్యులు చెప్పేది ఏమిటి అంటే.

మీరు చక్కెర బదులు బెల్లం తీసుకున్నా ఆ ప్లేస్ లో తేనే తీసుకున్నా షుగర్ లాంటి పరిస్దితే ఉంటుంది, ఈ రెండూ కూడా షుగర్ ని పెంచుతాయి కాని తగ్గించవు. అయితే లెమన్ ఉదయం వేడి నీటిలో తాగేవారు ఉంటారు, అలాంటి వారు మూడు లేదా నాలుగు రోజులకి ఓ అరస్పూన్ తేనె వేసుకుని నిమ్మనీరు తాగచ్చు.. రోజూ తాగితే మాత్రం ఇబ్బంది వస్తుంది, బెల్లం తేనే డయాబెటిస్ పేషంట్లు తీసుకోవద్దు అని సలహా ఇస్తున్నారు వైద్యులు. తీసుకున్నా రోజూ కాకుండా వారానికి లేదా పది రోజులకి మితంగా తీసుకోవాలి.